స్పోర్ట్స్ డెస్క్: DC vs MI: ముంబై ఇండియన్స్ ఎట్టకేలకు ఘన విజయాన్ని నమోదు చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్‌పై ఆదివారం జరిగిన ఉత్కంఠభరిత పోరులో ముంబై జట్టు 12 పరుగుల తేడాతో గెలుపొందింది. జేక్ ఫ్రెజర్ గోల్డెన్ డక్‌గా వెనుదిరిగినా.. కరుణ్ నాయర్ (89) పోరాటం చేశాడు. కానీ అది వృథా అయ్యింది.
ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 205 పరుగులు చేసింది. తిలక్ వర్మ (59), రికెల్టన్ (41), సూర్యకుమార్ యాదవ్ (40), నమన్ ధీర్ (38 నాటౌట్) తమ ఆటతో ఆకట్టుకున్నారు. ఢిల్లీ బౌలర్లలో కుల్దీప్ యాదవ్, విప్రజ్ నిగమ్ చెరో 2 వికెట్లు తీశారు.
లక్ష్య ఛేదనలో ఢిల్లీ 19 ఓవర్లలో 193 పరుగులకు ఆలౌటైంది. కరుణ్ నాయర్ (89), అభిషేక్ పోరెల్ (33) రాణించగా.. చివర్లో హ్యాట్రిక్ రనౌట్స్ మ్యాచ్‌ను మళ్లించాయి. 19వ ఓవర్లో బుమ్రా బౌలింగ్‌లో అషుతోష్ శర్మ, కుల్దీప్ యాదవ్, మోహిత్ శర్మ వరుసగా రనౌటయ్యారు.
కర్ణ్ శర్మ (3/36), మిచెల్ సాంట్నర్ (2), బుమ్రా, దీపక్ చాహర్ తలో వికెట్ తీసారు. మ్యాచ్ టర్నింగ్ పాయింట్‌గా కర్ణ్ శర్మ కీలకమైన వికెట్లు తీసి ఢిల్లీ భాగస్వామ్యాన్ని విడదీశాడు.
ఈ విజయం ద్వారా ముంబై ఇండియన్స్ పాయింట్ల పట్టికలో తొలి విజయాన్ని ఖాతాలో వేసుకుంది. వరుస పరాజయాల అనంతరం వచ్చిన ఈ విజయం జట్టుకు కొత్త ఉత్సాహాన్ని నింపింది.