టాలీవుడ్: టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ, అగ్ర తార అనే పేరుకి కొంత దూరం లో ఉన్న రష్మిక మందన్న నటించిన సినిమా డియర్ కామ్రేడ్. 2019 లో విడుదలైన ఈ సినిమా మిక్స్డ్ రెస్పాన్స్ తో థీరిటికల్ రిలీజ్ ఆశింతిన ఫలితాలని ఇవ్వలేదు. అయినప్పటికీ చాలా మంది అభిమానుల గుండెల్లో ఈ సినిమాకి కల్ట్ గుర్తింపు లభించింది. ఓటీటీ ల్లో ఈ సినిమాకి చాలానే వ్యూస్ వచ్చాయి. ఈ సినిమాకి మొదట్లో కరణ్ జోహార్ హిందీ లో రీమేక్ చేసే ప్లాన్ లో ఉన్నారు. కానీ తెలుగు లో ఫలితం తేడా కొట్టడం తో డబ్ చేసి యు ట్యూబ్ లో విడుదల చేసారు. మరి హిందీ వాళ్ళకి ఏం నచ్చిందో ఏమో కానీ ఇప్పటివరకు ఏ సినిమాకి రాని వ్యూస్ , లైక్స్ ఈ సినిమాకి వచ్చాయి.
ఈ సినిమాలో లిల్లీ, బాబీ లుగా రష్మిక, విజయ్ చేసిన నటన అమితంగా ఆకట్టుకుంటుంది. సినిమా కొంచెం లాగ్ అనిపించినప్పటికీ సినిమా స్టోరీ పరంగా, నటీ నటుల నటన పరంగా అన్నిటికంటే ముఖ్యంగా జస్టిన్ ప్రభాకరన్ ఇచ్చిన సంగీతం మాత్రం అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఇప్పుడు హిందీ అభిమానులు కూడా ఈ విషయాన్నే రుజువు చేసారు. ఈ సినిమాకి వచ్చిన అతి ఎక్కువ లైక్స్, వ్యూస్ ఏ దీనికి సాక్ష్యం. ఏడు నెలల క్రితం హిందీలో విడుదల అయిన ‘డియర్ కామ్రేడ్’ సినిమా అక్కడ మంచి టాక్ ను సొంతం చేసుకుంది. యూట్యూబ్ లో ఈ సినిమా ఇప్పటి వరకు 160 మిలియన్ ల వ్యూస్ వచ్చాయి. ఈ సినిమాకు ఏకంగా రెండు మిలియన్ ల లైక్స్ వచ్చాయి.ఇప్పటి వరకు ఏ ఇండియన్ మూవీకి ఈ స్థాయి యూట్యూబ్ వ్యూస్ వచ్చిన దాఖలాలు లేవు. ఇప్పుడు మోస్ట్ లైక్డ్ మూవీగా నెం.1 స్థానంలో నిలిచింది.