టాలీవుడ్: నితిన్ తో నటించిన ‘లై’, ‘చల్ మోహన రంగ’ సినిమాల ద్వారా పరిచయం అయిన నటి ‘మేఘా ఆకాష్’. ఆ తర్వాత తెలుగులో అంతగా సినిమాల్లో నటించకపోయినా తమిళ్ లో బాగానే సినిమాలు చేస్తుంది. శ్రీ విష్ణు తో ప్రస్తుతం ‘రాజ రాజ చోర’ అనే సినిమాలో కూడా నటిస్తుంది. ప్రస్తుతం మేఘా ముఖ్య పాత్రలో ‘డియర్ మేఘా’ అనే టైటిల్ తో ఒక సినిమా రూపొందుతుంది. ఈ సినిమా టీజర్ ఈ రోజు విడుదలైంది. అవుట్ అండ్ అవుట్ లవ్ స్టోరీ అండ్ ఎమోషన్స్ చుట్టూ ఉండే సినిమా అన్నట్టు టీజర్ ద్వారా తెలుస్తుంది. ఒక అమ్మయి ఇద్దరు అబ్బాయిల మధ్య ఉండే ప్రేమ కథ అన్నట్టు తెలుస్తుంది.
టీజర్ ఆరంభం లో లవ్ చేయడం లో నేను PHD చేశాను అంటూ మేఘా చెప్పే డైలాగ్ తో మొదలు పెట్టారు. తర్వాత హీరో కాలేజ్ లో ఉన్నపుడు నన్నెప్పుడైనా చూసావా అంటే నిన్ను చూడకుండా బుక్స్ చదివుంటే టాపర్ అయ్యేదాని అని చెప్పే డైలాగ్స్ తో టీజర్ లో లవ్ స్టోరీ ని నరేట్ చేసారు. ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఫీల్ వచ్చేట్టు చూపించారు కానీ ఒకే సారి జరిగే రెండు స్టోరీలు కాదు అన్నట్టు తెలుస్తుంది. మేఘా తో పాటు అరుణ్ ఆదిత్, అర్జున్ సోమయాజుల ఈ సినిమాలో నటిస్తున్నాడు. కేవలం మేఘా ఫేమ్ తో నే ఈ సినిమా నెట్టుకురావాల్సిన పరిస్థితి ఉంది. వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై అర్జున్ దాస్యన్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. A సుశాంత్ రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుంది. ఆగష్టు లో ఈ సినిమాని విడుదల చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.