కాన్పూర్: భారత టెస్ట్ టీం కు నూతనంగా అరంగేట్రం చేసిన ఆటగాడు శ్రేయస్ అయ్యర్ తన తొలి టెస్టు మ్యాచ్‌లో పలు రికార్డులను నెలకొల్పాడు. న్యూజిలాండ్‌తో కాన్పూర్ లో జరుగుతున్న తొలి టెస్టులో శ్రేయస్ అయ్యర్ సెంచరీ సాధించాడు. తద్వారా అరంగేట్ర మ్యాచ్‌లోనే సెంచరీ సాధించిన 16వ భారత ఆటగాడిగా ఇవాళ శ్రేయస్ ఘనతను సాధించాడు.
ఈ రికార్డు తో పాటు తన డెబ్యూట్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై సెంచరీ చేసిన మూడవ భారత ఆటగాడిగా శ్రేయస్ నిలిచాడు. శ్రేయస్ అయ్యర్ 168 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్స్‌లతో 105 పరుగులు సాధించాడు.
ఈ తొలి మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో 105 పరుగులు చేసిన అయ్యర్ సౌథీ బౌలింగ్‌లో విల్ కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యి పెవిలియన్ చేరాడు. కాగా తొలి రోజు మ్యాచ్ ప్రారంభానికి ముందు దిగ్గజ క్రికెటర్ సునిల్ గావస్కర్ చేతుల మీదుగా టీమిండియా క్యాప్(303)ను శ్రేయస్ అయ్యర్ అందుకున్నాడు.