టాలీవుడ్: టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి ప్రస్తుతం డైరెక్ట్ చేసున్న సినిమా RRR . బాహుబలి సినిమా తర్వాత అయన రేంజ్ నేషనల్ లెవెల్ కి చేరుకుంది. బాహుబలి సినిమా షూటింగ్ దాదాపు మూడు నాలుగేళ్లు అయినా కూడా ఎక్కడా కూడా జనాల నోళ్ళలోంచి ఆ సినిమా గురించి మాట్లాడుకునేట్లు ఎదో ఒక అప్డేట్ వదులుతూ ఉండే వాడు. ఇపుడు RRR కి కూడా ఇంచుమించు అలాంటి ప్రచార అస్త్రాన్ని వాడు తున్నాడు. దీపావళి సందర్భంగా సినిమా మెయిన్ ఆక్టర్స్ రామ్ చరణ్, ఎన్టీఆర్ లతో తాను కూడా కలిసి ఒక ఫోటోషూట్ చేసి విడుదల చేసారు.
దీపావళి సందర్భం గా థీమ్ తగ్గట్టు RRR టైటిల్ ని బ్యాక్ గ్రౌండ్ లో లైట్స్ తో దీపాలతో అలంకరించి హీరోలని ట్రెడిషనల్ వేర్ లో ఒక ఫోటో షూట్ చేయించి విడుదల చేసారు. దీపావళి పండగ శుభాకాంక్షలు తెలియచేస్తూ ఈ ఫొటోస్ విడుదల చేసారు. ఈ సినిమాకి సంబందించిన రామ్ చరణ్ ‘అల్లూరి సీతారామరాజు’ టీజర్ మరియు ఎన్టీఆర్ కి సంబందించిన ‘కొమరం భీం’ టీజర్ ఇదివరకే విడుదల అయ్యి చాలా ప్రశంసలు, వ్యూస్ పొందాయి. కరోనా తర్వాత ఈ మధ్యనే షూటింగ్ మొదలుపెట్టిన ఈ సినిమా టీం శరవేగంగా సినిమా షూటింగ్ పూర్తి చేసే పనుల్లో నిమగ్నమై ఉంది.