యూపీ: భారత మహిళా క్రికెట్ జట్టు ఆల్రౌండర్ దీప్తి శర్మకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం డీఎస్పీ (డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్) పదవి ఇచ్చింది. దేశానికి ఆమె చేసిన సేవలకు గుర్తింపుగా జనవరి 27న యూపీ ప్రభుత్వం మొరాదాబాద్ జిల్లాలో ఆమెను డీఎస్పీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ విషయాన్ని దీప్తి బుధవారం తన ఇన్స్టాగ్రామ్ ద్వారా పంచుకుంది. ఈ సందర్భంగా తన చిన్ననాటి కల నెరవేరిందని, డీఎస్పీగా విధులు నిర్వహించనున్నందుకు గర్వంగా ఉందని దీప్తి తెలిపింది.
ఆమె తన కుటుంబానికి, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపింది. డీఎస్పీగా బాధ్యతలను నిజాయితీగా నిర్వర్తిస్తానని హామీ ఇచ్చింది.
ఇదిలా ఉంటే, ఇటీవలి కాలంలో డీఎస్పీ పదవి పొందిన రెండో భారత క్రికెటర్గా దీప్తి నిలిచింది. 2024లో టీ20 ప్రపంచ కప్ విజయం తర్వాత తెలంగాణ ప్రభుత్వం మహ్మద్ సిరాజ్ను డీఎస్పీగా నియమించిన విషయం తెలిసిందే.
ప్రస్తుతం మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) కోసం సిద్ధమవుతున్న దీప్తి, యూపీ వారియర్స్ జట్టుకు కెప్టెన్గా ఉన్నారు. ఈ సీజన్లో ఆమె టైటిల్ గెలవాలని లక్ష్యంగా పెట్టుకుంది.