వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురువారం 2020 ఎన్నికలను ఆలస్యం చేయాలని సూచించారు. ప్రస్తుతం ఎన్నికల నిర్వహణ ప్రక్రియ కూడా బాగా వెనుకబడి ఉంది, కరోనా వైరస్ను ఉటంకిస్తూ, “మోసపూరిత” ఓటింగ్ కూడా జరిగే అవకాశాలు ఉన్నాయని అని ఆయన అన్నారు. “ప్రజలు సరిగ్గా, సురక్షితంగా మరియు భద్రంగా ఓటు వేసే వరకు ఎన్నికలు ఆలస్యం చేయాలేమా ???” అని ట్రంప్ తన ట్వీట్‌లో అడిగారు.
అమెరికా రాజ్యాంగంలో ఆలస్యం అన్న పదానికే చోటు లేదు. అయినా అధ్యక్షుడు ట్రంప్ గురువారం ‘‘దేశ చరిత్రలోనే 2020 ఎన్నికల్లో కచ్చితత్వం లోపిస్తుందని, భారీగా అవకతవకలు జరుగుతాయి. దీనివల్ల అమెరికా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాలి’’ అని ట్వీట్ చేశారు.
కరోనా నేపథ్యంలో ఎన్నికలకు చాలా మంది మెయిల్ ఇన్ ఓటింగ్ పద్ధతిని ఆశ్రయిస్తున్నారు. మెయిల్ ద్వారా ఓటు వేసే ప్రక్రియలో విదేశీ హస్తం కూడ ఉంటుందని ట్రంప్ ఈ సందర్భంగా అనుమానం వ్యక్తం చేశారు. ప్రజలంతా సురక్షితంగా ఓటేసే పరిస్థితులు వచ్చే వరకు ఎన్నికలు వాయిదా వేస్తే ఏమవుతుంది ? అని ట్రంప్ ఆ ట్వీట్‌లో ప్రశ్నించారు.