fbpx
Monday, January 20, 2025
HomeSportsఢిల్లీ చేతిలో కోల్కత్తా నైట్ రైడర్స్ ఓటమి

ఢిల్లీ చేతిలో కోల్కత్తా నైట్ రైడర్స్ ఓటమి

DELHI-18-RUNS-WIN-ON-KKR

షార్జా: 2020 ఐపీఎల్‌ ‌లో ఇంకో మ్యాచ్ లో సిక్సర్ల మోత మోగింది. ఢిల్లీ క్యాపిటల్స్‌-కోల్‌కతా నైట్‌రైడర్స్‌ల మధ్య జరిగిన మ్యాచ్‌ ఈ పరుగుల మోతకు వేదికయ్యింది. ఊహించినట్లే షార్జాలో ఇరుజట్లు పరుగుల హోరులో తడిసిపోయాయి. ఈ ఉత్కంఠ భరితమైన పోరులో ఆఖరుకు ఢిల్లీ క్యాపిటల్స్‌ 18 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ, కేకేఆర్‌లు తలో 14 సిక్స్‌లు బాదారు.

ఢిల్లీ విసిరిన 229 పరుగుల టార్గెట్‌లో కేకేఆర్‌ ఎనిమిది వికెట్లు కోల్పోయి 210 పరుగులకే పరిమితమయ్యింది. కేకేఆర్‌ ఆటగాళ్లలో గిల్‌(28; 22 బంతుల్లో 2ఫోర్లు, 1 సిక్స్‌), నితీష్‌ రాణా(58; 35 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లు), మోర్గాన్‌(44;18 బంతుల్లో 1 ఫోర్‌, 5 సిక్స్‌లు), రాహుల్‌ త్రిపాఠి(36; 16 బంతుల్లో 3 ఫోర్లు, 3సిక్స్‌లు)లు మెరుపులు మెరిపించినా గెలవలేక పోయింది కొల్కత్తా.

సునీల్‌ నరైన్‌(3), ఆండ్రీ రసెల్‌(13), దినేశ్‌ కార్తీక్‌(6)లు తక్కువ పరుగులకే అవుట్ కావడంతో కేకేఆర్‌ ఓటమి పాలైంది. ఢిల్లీ బౌలర్లలో నోర్త్‌జే మూడు వికెట్లు సాధించగా, హర్షల్‌ పటేల్‌ రెండు వికెట్లు సాధించాడు. రబడా, స్టోయినిస్‌, మిశ్రాలు తలో వికెట్‌ తీశారు. ఓ దశలో మోర్గాన్‌-త్రిపాఠిలు బ్యాట్‌ ఝుళిపించడంతో ఢిల్లీ గుండెల్లో దడపుట్టింది. కాగా, మోర్గాన్‌ నోర్త్‌జే ఔట్‌ చేయడం, ఆపై త్రిపాఠిని స్టోయినిస్‌ బౌల్డ్‌ చేయడంతో కేకేఆర్‌ ఓటమి ఖాయమైంది.

తొలుత బ్యాటింగ్‌ చేసిన ఢిల్లీ కేవలం నాలుగు వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది. పృథ్వీ షా(66; 41 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లు), శ్రేయస్‌ అయ్యర్‌(88 నాటౌట్‌; 38 బంతుల్లో 7ఫోర్లు, 6 సిక్స్‌లు), రిషభ్‌ పంత్‌( 38; 17 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌)లు రాణించడంతో ఢిల్లీ భారీ స్కోరు చేసింది. ఈ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకోవడంతో ఢిల్లీ ముందుగా బ్యాటింగ్‌కు దిగింది.

కేకేఆర్‌ బౌలర్లలో నాగర్‌కోటి, వరుణ్‌ చక్రవర్తిలకు తలో వికెట్‌ దక్కింది. ఈ మ్యాచ్‌లో ప్యాట్‌ కమిన్స్‌ 49 పరుగులు ఇవ్వగా, మావి 3 ఓవర్లలో 40 పరుగులిచ్చాడు. ఇక నాగర్‌కోటి మూడు ఓవర్లు వేసి 35 పరుగులిచ్చాడు. వరుణ్‌ చక్రవర్తి తన నాలుగు ఓవర్ల కోటాలో 49 పరుగులు సమర్పించుకున్నాడు. రసెల్‌ ఒక్కడే 4 ఓవర్లలో రెండు వికెట్లు సాధించి 29 పరుగులిచ్చాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular