ముంబై: ఐపీఎల్ 2021 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ)కు ఘనమైన ఆరంభం లభించింది. శనివారం జరిగిన తొలి మ్యాచ్‌లో ఢిల్లీ ఏడు వికెట్లతో మాజీ చాంపియన్ సీఎస్‌కే పై ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 188 పరుగులు చేసింది.
చెన్నై తరఫున పునారగమనం చేసిన సురేశ్ రైనా (36 బంతుల్లో 54; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్ధ సెంచరీ సాధించగా, మొయిన్ అలీ (24 బంతుల్లో 36; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), స్యామ్ కరన్ (15 బంతుల్లో 34; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. వోక్స్, అవేశ్ ఖాన్ చెరో రెండు వికెట్లు సాధించారు.
తదుపరి బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 18.4 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే నష్టపోయి 190 పరుగులు చేసి గెలుపొందింది. ఓపెనర్లు శిఖర్ ధావన్ (54 బంతుల్లో 85; 10 ఫోర్లు, 2 సిక్స్‌లు), పృథ్వీ షా (38 బంతుల్లో 72; 9 ఫోర్లు, 3 సిక్స్‌లు) ఆకాశమే హద్దుగా చెలరేగారు. ఈ మ్యాచ్‌తో ఐపీఎల్‌లో ఢిల్లీ జట్టు (డేర్‌డెవిల్స్, క్యాపిటల్స్) తరఫున 100వ మ్యాచ్ ఆడిన తొలి ప్లేయర్‌గా అమిత్ మిశ్రా నిలిచాడు.
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్‌కు శుభారంభం లభించలేదు. పేలవ ఫామ్‌లో ఉన్న డు ప్లెసిస్ (0) డకౌట్‌గా వెనుదిరగ్గా… ఫోర్ కొట్టి టచ్‌లో కనిపించిన రుతురాజ్ గైక్వాడ్ (5)ను వోక్స్ పెవిలియన్‌కు చేర్చడంతో సీఎస్‌కే 7 పరుగులకే రెండు వికెట్లను కోల్పోయింది.
మరో ఎండ్‌లో అంబటి రాయుడు (23; 1 ఫోరు, 2 సిక్స్‌లు) అతడికి చక్కటి సహకారం అందించడంతో చెన్నై స్కోరు 100 పరుగులు దాటింది. వీరు నాలుగో వికెట్‌కు 63 పరుగులు జోడించారు. రాయుడు అవుటైన కాసేపటికే జడేజా (26 నాటౌట్; 3 ఫోర్లు)తో సమన్వయ లోపంతో రైనా రనౌట్ అయ్యాడు. అనంతరం వచ్చిన ధోని (0) నిరాశ పరిచాడు.
చివర్లో స్యామ్ కరన్, జడేజా దూకుడుగా ఆడటంతో సీఎస్‌కే చివరి ఐదు ఓవర్లో 52 పరుగులు చేయగలిగింది. ఇంగ్లండ్‌కు చెందిన ‘కరన్ బ్రదర్స్’ స్యామ్, టామ్ ఈ మ్యాచ్‌లో ఎదురెదురుగా ఆడారు. స్యామ్ చెన్నై తరఫున, టామ్ ఢిల్లీ తరఫున బరిలోకి దిగారు. చెన్నై ఇన్నింగ్స్‌లో టామ్ బౌలింగ్‌లో స్యామ్ 9 బంతులు ఎదుర్కొన్నాడు.