ముంబై: ముంబైలోని వాంఖడే స్టేడియంలో గురువారం జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2022 సీజన్ 41వ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్)పై ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ) నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది.
కోల్కత్తా నిర్ధేశించిన 147 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన డీసీ 19 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది, డేవిడ్ వార్నర్ 26 బంతుల్లో 42 పరుగులు నమోదు చేశాడు.
రోవ్‌మన్ పావెల్ మ్యాచ్ విన్నింగ్ సిక్స్ కొట్టి 16 బంతుల్లో 33 పరుగులతో అజేయంగా నిలిచాడు. మొదట, కేకేఆర్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది, డీసీ బౌలర్ కుల్దీప్ యాదవ్ మూడు ఓవర్లలో నాలుగు వికెట్లు పడగొట్టాడు.