ముంబై: పంజాబ్ పై రిషబ్ సేన ఢిల్లీ క్యాపిటల్స్ 17 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ధేశించిన 160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ 20 ఓవర్లలో కేవలం 142 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది.
పంజాబ్ కింగ్స్ బ్యాట్స్ మెన్లలో జితేష్ శర్మ ఒక్కడే 44 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఢిల్లీ బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ నాలుగు వికెట్లు, అక్షర్ పటేల్ ,కుల్ధీప్ యాదవ్ చెరో రెండు వికెట్లు, నోర్జే ఒక్క వికెట్ తీసి పంజాబ్ బ్యాట్స్ మెన్లను పెవిలియన్ కు పంపారు.
తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. ఢిల్లీ బ్యాటర్లలో మిచెల్ మార్ష్ 63 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఢిల్లీ బ్యాటర్స్ అందరూ వరుసగా పెవిలియన్ బాట పట్టడంతో తక్కువ స్కోరు చేయగలిగింది. పంజాబ్ బౌలర్లలో లియామ్ లివింగ్‌స్టోన్, ఆర్షదీప్ సింగ్ చెరో మూడు వికెట్లు పడగొట్టగా, రబాడ ఒక్క వికెట్ సాధించాడు.