fbpx
Wednesday, November 27, 2024
HomeNationalసుప్రీంకోర్టులో కేజ్రీవాల్‌కు మళ్ళీ చుక్కెదురు

సుప్రీంకోర్టులో కేజ్రీవాల్‌కు మళ్ళీ చుక్కెదురు

Delhi-Chief Minister-Arvind Kejriwal

న్యూఢీల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు బుధవారం సుప్రీంకోర్టు నుంచి ఊరట లభించలేదు.

బెయిల్ పిటిషన్‌పై సీబీఐకి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు బుధవారం సుప్రీంకోర్టు నుంచి ఊరట లభించలేదు. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత బెయిల్ పిటిషన్‌పై సీబీఐకి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈరోజు సీబీఐ న్యాయవాది కోర్టుకు హాజరుకాలేదు. దీనిపై సర్వోన్నత న్యాయస్థానం మరోవైపు వాదనలు కూడా వింటామని పేర్కొంటూ కేసు విచారణకు తదుపరి తేదీని ప్రకటించింది. ఈ అంశంపై తదుపరి విచారణను ఆగస్టు 23కి వాయిదా వేసింది.

ఎక్సైజ్ పాలసీ కుంభకోణానికి సంబంధించిన అవినీతి కేసులో సీబీఐ అరెస్టును సమర్థిస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను కేజ్రీవాల్ సవాలు చేశారు. ఆగస్టు 23లోగా సీబీఐ నుంచి సమాధానం కోరిన సుప్రీంకోర్టు.. కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసేందుకు నిరాకరించింది. గతంలో సీబీఐ కేసులో ఆయన జ్యుడీషియల్ కస్టడీని ఆగస్టు 20 వరకు కోర్టు పొడిగించింది. ఈ కేసులో సంజయ్ సింగ్, మనీష్ సిసోడియాలకు బెయిల్ మంజూరైంది.

సీబీఐ నమోదు చేసిన అవినీతి కేసులో కేజ్రీవాల్ ప్రస్తుతం జైలులో ఉండటం గమనార్హం. సీబీఐ అరెస్టును రద్దు చేయాలన్న కేజ్రీవాల్‌ డిమాండ్‌ను ఢిల్లీ హైకోర్టు ఆగస్టు 5న తిరస్కరించి బెయిల్‌ కోసం దిగువ కోర్టును ఆశ్రయించాలని కోరింది. హైకోర్టు ఆదేశాలను కేజ్రీవాల్ సుప్రీంకోర్టులో సవాలు చేశారు.

మనీలాండరింగ్ (ఈడీ) కేసులో కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు ఇప్పటికే మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది, సీబీఐ కేసులో బెయిల్ లభిస్తే జైలు నుండి బయటపడతారు. మనీలాండరింగ్ కేసులో జైల్లో ఉన్న కేజ్రీవాల్‌ను సీబీఐ జూన్ 26న అరెస్టు చేసింది. కేజ్రీవాల్ రెండు పిటిషన్లు దాఖలు చేశారు, ఒకటి సీబీఐ అరెస్టును సవాలు చేస్తూ.. మరొకటి బెయిల్ కోరుతూ పిటీష‌న్‌లు దాఖ‌లు చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular