ఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసిన వెంటనే ఎగ్జిట్ పోల్స్ బీజేపీ విజయం ఖాయమని సూచిస్తున్నాయి. 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో తిరిగి బీజేపీ అధికారంలోకి వస్తుందని మేజర్ ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి.
మోదీ హవా కొనసాగుతుందని, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) తక్కువ స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వస్తుందని అంచనా వేస్తున్నాయి.
తాజా ఎగ్జిట్ పోల్స్ ప్రకారం బీజేపీకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయనే స్పష్టత వచ్చింది. కొన్ని సర్వేలు మాత్రం ఆప్ పోటీ ఇస్తుందనే సంకేతాలు ఇస్తున్నా, మెజార్టీ పోల్స్ బీజేపీదే అధికారమని స్పష్టం చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీకైతే పూర్తిగా నీరసించిపోయినట్లు కనిపిస్తోంది.
ఎగ్జిట్ పోల్స్ అంచనాలు:
పీపుల్స్ పల్స్ – కొడిమో: బీజేపీ 51-60, ఆప్ 10-19, కాంగ్రెస్ 0
చాణక్య స్ట్రాటజీస్: బీజేపీ 39-44, ఆప్ 25-28, కాంగ్రెస్ 2-3
పీపుల్స్ ఇన్ సైట్: బీజేపీ 40-44, ఆప్ 25-29, కాంగ్రెస్ 1
రిపబ్లిక్ పీమార్క్: బీజేపీ 39-49, ఆప్ 21-31, కాంగ్రెస్ 1
టైమ్స్ నౌ: బీజేపీ 39-45, ఆప్ 29-31, కాంగ్రెస్ 0-1
ఏబీపీ మ్యాట్రిజ్: బీజేపీ 35-40, ఆప్ 32-37, కాంగ్రెస్ 0-1
పోల్ డైరీ: బీజేపీ 42-50, ఆప్ 18-25, కాంగ్రెస్ 0-2
ఈ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు నిజమైతే, బీజేపీ ఢిల్లీలో తిరిగి అధికారం చేపట్టనుంది. తుది ఫలితాలు మాత్రం త్వరలోనే వెలువడనున్నాయి.