టాలీవుడ్: ‘ఐడియాలే బ్రతకనపుడు ప్రపంచం లో లూటీ చేయడానికి కూడా ఏమి మిగలదు’ – నాగచైతన్య నటించిన ఆటో నగర్ సూర్య సినిమాలోని డైలాగ్ ఇది. సరిగ్గా అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నాడు ఈ సినిమా డైరెక్టర్. వెన్నెల సినిమా తో ఇండస్ట్రీ ప్రయాణం ప్రారంభింది ‘ప్రస్తానం’ లాంటి ఇంటెన్స్ మూవీ ని అందించి తర్వాత టైం కలిసి రాక పెద్దగా సినిమాలు పడలేదు కానీ మంచి కటౌట్ ఉన్న హీరో కి ఈ డైరెక్టర్ తగిలి ఉంటె తన కంటెంట్ తో అద్భుతమైన సినిమాలు తియ్యగల సత్తా ఉన్న డైరెక్టర్ ‘దేవా కట్ట‘. ఎన్టీఆర్ బయోపిక్ విషయం లో తన ఐడియాలు కాపీ కొట్టారని ట్విట్టర్లో చెప్పారు.
వై ఎస్ రాజ శేఖర్ రెడ్డి, నారా చంద్ర బాబు నాయుడు ఇద్దరు కలిసి ఒకే పార్టీ లో ఉన్నప్పుడు వాళ్ళ స్నేహం, వాళ్ళ పరిస్థితుల ఇతి వృత్తం పైన ఒక వెబ్ సిరీస్ ప్రకటించారు ప్రొడ్యూసర్ ‘విష్ణు ఇందూరి’. దీనిపై దేవా కట్ట తన ట్విట్టర్ ద్వారా స్పందించాడు.
2017 లో సరిగ్గా ఇదే థీమ్ గా చేసుకొని ఒక కథని రాసుకొని తాను తన పేరు పైన కాపీ రైట్స్ చేయించుకున్నట్టు చెప్పారు. 2017 తర్వాత ఆ కథ పై వివిధ వెర్షన్స్ రాసుకున్నట్టు చెప్పారు. మొదలు సినిమా కథలా అనుకున్నప్పటికీ తర్వాత దాన్ని వెబ్ సిరీస్ కథ లాగ కూడా మార్పులు చేసానని చెప్పాడు. కానీ వివిధ పార్టీ ల్లో ఈ ఐడియా గురించి షేర్ చేసుకున్న తర్వాత ఆ ఐడియాలతో వేరే వాళ్ళని పెట్టి ఇదే కథను తీస్తున్నారు అని దేవా కట్ట ఆ ప్రొడ్యూసర్ పైన కాపీ అభియోగాలు మోపాడు. ఇదే ప్రొడ్యూసర్ ఎన్టీఆర్ బయో పిక్ అప్పుడు కూడా తన ఆలోచనలు కాపీ కొట్టి ఘోర పరాజయాన్ని మూట కట్టుకున్నాడనీ కూడా చెప్పాడు.