టాలీవుడ్: వెన్నెల , ప్రస్తానం, ఆటో నగర్ సూర్య సినిమాలని రూపొందించిన దర్శకుడు దేవా కట్ట దర్శకత్వం లో సాయి ధరమ్ తేజ్ హీరోగా ‘రిపబ్లిక్’ అనే సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ప్రస్తానం , ఆటో నగర్ సూర్య లాంటి ఇంటెన్సిటీ సినిమాల తర్వాత మంచి కంటెంట్ ఉన్న దర్శకుడిగా దేవా కట్టకి పేరుంది. ‘వాతావరణం అనుకూలిస్తేనే పండ్లు అందించే చెట్టు నేని ఇప్పటినుండి వాతావరణం అనుకూలిస్తుంది అనుకుంటున్నాను’ అని దేవా కట్ట తన కాన్ఫిడెన్స్ ని తెలియచేసాడు.
ఈ రోజు రిపబ్లిక్ సినిమా టీజర్ విడుదలైంది. ఈ టీజర్ ఆద్యంతం ఇంటెన్స్ డైలాగ్స్, ఆకట్టుకునే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో ఆకట్టుకుంది. దేవా కట్ట తన టాలెంట్ ని నిరూపించుకోవడానికి మరోసారి పొలిటికల్ డ్రామా ని ఎంచుకున్నాడు. ఈ సినిమాలో సాయిధరమ్ తేజ్ ఒక IAS పాత్రలో నటిస్తున్నాడు. ‘ప్రజాస్వామ్యం అంటే కేవలం ఓటు హక్కో అరిచే హక్కో అనే భ్రమలో ఉన్నాం. కానీ కట్టకుండా కూలిపోతున్న వ్యవస్థలే ఆ ప్రజాస్వామ్యానికి పునాదులని తెలియకుండా ఇంకా ఫ్యూడల్ వ్యవస్థలోనే బ్రతుకుతున్నాం’, ‘ప్రజలే కాదు సివిల్ సర్వీసెస్, కోర్టులు కూడా ఆ రూలర్స్ కింద బానిసల్లానే బతుకుతున్నారు అని ప్రస్తుత వ్యవస్థని ఒక చిన్న డైలాగ్ ద్వారా తెలిపాడు. ‘వ్యవస్థ పునాదులే కరప్ట్ అయినప్పుడు అందరూ కరప్టే’ లాంటి డైలాగ్స్ తో కేవలం పవర్ ఫుల్ గానే కాకుండా ఆలోచింపజేసేలా కూడా ఉన్నాయి.
మరొక పవర్ఫుల్ పాత్రలో రమ్య కృష్ణ నటిస్తుంది. ఈ సినిమాకి మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ కి జోడీ గా తమిళ నటి ఐశ్వర్య రాజేష్ మరో కీలకపాత్రలో నటిస్తుంది. జీ స్టూడియోస్ మరియు జె.బి. ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై జె.భగవాన్, జె.పుల్లారావు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమాని జూన్ 4 న థియేటర్లలో విడుదల చేయనున్నట్టు ఇదివరకే ప్రకటించారు.