టాలీవుడ్: ‘వెన్నెల’, ‘ప్రస్ధానం’, ‘ఆటో నగర్ సూర్య’ లాంటి సినిమాలు రూపొందించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు దేవా కట్ట. ఈ సారి మరో సారి తన పెన్ పవర్ చూపించడానికి సిద్ధంగా ఉన్నాడు. మరో సారి ఒక పవర్ఫుల్ పొలిటికల్ థ్రిల్లర్ సినిమాతో రాబోతున్నాడు. సాయి ధరమ్ తేజ్, దేవా కట్ట కాంబినేషన్ లో ‘రిపబ్లిక్’ అనే పొలిటికల్ థ్రిల్లర్ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ రోజు ఈ సినిమాకి సంబందించిన విడుదల తేదీ ప్రకటించారు. జూన్ 4 న ఈ సినిమాని విడుదల చేయనున్నట్టు ఈరోజు అధికారికంగా ప్రకటించారు.
ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ తో తమిళ నటి ‘ఐశ్వర్య రాజేష్‘ నటిస్తున్నారు. ఈ సినిమాకి మణిశర్మ సంగీతం అందించనున్నాడు. జె.బి. ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై జె.భగవాన్, జె.పుల్లారావు కలిసి సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. కరోనా తర్వాత షూటింగ్ మొదలుపెట్టిన ఈ సినిమా అతి త్వరగా షూటింగ్ ముగించి విడుదల చేసే పనిలో ఉన్నారు. ‘సోలో బ్రతుకే సో బెటర్’ అనే సినిమాని రిస్క్ చేసి విడుదల చేసి ఇపుడు రాబోతున్న వరుస విడుదలలకి దారి చూపించాడు సాయి ధరమ్ తేజ్. ఈ సినిమా ఇచ్చిన సక్సెస్ తోనే రిపబ్లిక్ సినిమాతో కూడా మరో హిట్ కొట్టాలని చూస్తున్నాడు ఈ సుప్రీమ్ హీరో.