fbpx
Sunday, January 19, 2025
HomeMovie Newsఅక్టోబర్ నుండి దేవాకట్టా, సాయి ధరమ్ తేజ్ సినిమా

అక్టోబర్ నుండి దేవాకట్టా, సాయి ధరమ్ తేజ్ సినిమా

DevakattaandSaidaramTej WillStartFrom MidOfOctober

హైదరాబాద్: కొంత మంది డైరెక్టర్స్ కంటెంట్ ఉన్నా కూడా కాలం కలిసి రాకనో తెలియదు మరే కారణమో తెలియదు కానీ వాళ్ళకి రావాల్సినంత సక్సెస్ గాని పేరు గాని రాదు. అలాంటి డైరెక్టర్స్ లో ముందుంటాడు దేవాకట్టా. వెన్నెల, ప్రస్థానం , ఆటోనగర్ సూర్య లాంటి సినిమాలు తీసిన ఈ డైరెక్టర్ కి ఆశించినంత గుర్తింపు రాలేదు. ఐతే చాల రోజుల తర్వాత ఈ డైరెక్టర్ కి మళ్ళీ సాయిధరమ్ తేజ్ తో ఒక సినిమా తీసే అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని వీలైనంత వరకు అందిపుచ్చుకుని తానేంటో నిరూపించుకునే పనిలో పడ్డాడు దేవా కట్ట. ఈ సినిమాకి సంబందించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ షర వేగంగా సాగుతున్నట్టు దేవా కట్ట ట్వీట్ చేసాడు. అలాగే అక్టోబర్ లో ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టబోతున్నట్టు తెలిపాడు.

ఐతే ఈ మధ్యనే ‘సోలో బ్రతుకే సో బెటర్’ షూటింగ్ ముగించేసిన సాయి ధరమ్ తేజ్ వేరే సినిమా ముందు చేసి ఆ తర్వాత దేవా కట్ట సినిమా చేయబోతున్నట్టు వార్తలు వచ్చాయి కానీ ఈ ప్రకటన తో ఆ వార్తలకి చెక్ పడింది. చిత్రలహరి, ప్రతి రోజు పండగే తర్వాత సాయి ధరమ్ తేజ్ మార్కెట్ కూడా పెరిగింది. ఈ హీరో కూడా ఒక గట్టి హిట్ కొట్టాలనే కసి తో ఉన్నాడు. అయితే డైరెక్టర్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ గురించి ట్వీట్ చేస్తూ ‘welve-aspect Mise-En-Scene ‘ అని మెన్షన్ చేసాడు. దానికి ఆసక్తి కరంగా సాయి ధరమ్ తేజ్ అంటే ఏంటని రిప్లై పెట్టాడు. దానికి బదులుగా డైరెక్టర్ ఆ మాటని వ్యక్తపరిచే ఒక స్క్రీన్ షాట్ పోస్ట్ చేసాడు. సినిమా షూటింగ్ కి సంబంధించి కాస్ట్యూమ్స్, సెట్స్, మేక్ అప్ .. ఇలా ఒక 12 క్రాఫ్టులని కలిపి ఆ వర్డ్ అన్నట్టు ట్వీట్ చేయడం ఆసక్తికరం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular