టాలీవుడ్: ‘ప్రస్తానం’ సినిమాతో రాజకీయంలో ఒక కోణాన్ని తన పవర్ఫుల్ డైలాగ్స్ తో అద్భుతమైన డైరెక్షన్ తో కుటుంబం లోని ఒక కోణాన్ని జోడించి అద్భుతం గా చూపించాడు డైరెక్టర్ దేవా కట్ట. ప్రస్తుతం అలాంటి మరొక ప్రయత్నమే తన ‘ఇంద్రప్రస్థం’ ద్వారా చేయబోతున్నట్టు తెలుస్తుంది. ఈ సారి ఇద్దరు స్నేహితులు, రాజకీయం లో గెలుపు కోసం ప్రయత్నించే నాయకులు అయితే ఎలా ఉంటుంది అనే సబ్జెక్టు ని ఎంచుకున్నాడు.
సంయుక్త ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రముఖ నాయకులని ఇన్స్పిరేషన్ గా తీసుకొని రాసిన కథగా మొదటి రీల్ లోనే చెప్పేసాడు డైరెక్టర్. ‘నైతిక విలువలు మారుతాయి కానీ పవర్ కోసం జరిగే యుద్ధం మాత్రం అలాగే ఉంటుంది’ అనే థీమ్ తో రూపొందించారు అని చెప్పారు మేకర్స్. ”ప్రపంచంలో జరిగే పోటీలన్నిటికీ మూల కారణం ఒక్కటే, విన్నర్స్ ని ఎంచుకోవడం, విన్నర్స్ రన్ ది వరల్డ్.. ఆ పోటీలో అనుకోకుండా ఇద్దరు స్నేహితులు ఎదురైతే.. ఆ ఆటకున్న కిక్కే వేరు” అని దేవా కట్ట చెప్పిన డైలాగ్ ఈ సినిమా నేపథ్యాన్ని తెలియజేస్తోంది. అలాగే మరోసారి దేవా కట్ట తన పెన్ పవర్ ని చూపించబోతున్నట్టు ఈ డైలాగ్ వింటే అర్ధం అవుతుంది. ఈ చిత్రాన్ని ప్రోడోస్ ప్రొడక్షన్ బ్యానర్ పై హర్ష. వి మరియు తేజ. సి కలిసి నిర్మిస్తున్నారు.సురేష్ బొబ్బిలి అందించిన నేపథ్య సంగీతం సినిమా థీమ్ కి తగినట్టుగా అద్భుతంగా ఉంది. అలాగే ఈ సినిమా పోస్టర్ లో చూపించిన నారా చంద్ర బాబు నాయుడు, వై ఎస్ రాజా శేఖర్ రెడ్డి షాడో ఇమేజెస్ చూస్తే ఈ కథ వాళ్ళని ఇన్స్పిరేషన్ గా తీస్కొని చేసినట్టు తెలుస్తుంది.