మూవీడెస్క్: ఇప్పటి ట్రెండ్‌లో మూడు లేదా నాలుగు వారాలు బ్రేక్ ఈవెన్ అంటేనే గొప్పగా భావిస్తారు. కానీ జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర శతదినోత్సవం ఏకంగా ఆరు కేంద్రాల్లో పూర్తి చేయడం విశేషం.
వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి తర్వాత ఈ ఫీట్ సాధించిన చిత్రం దేవర కావడం తారక్ అభిమానులను ఆనందంలో ముంచెత్తుతోంది.
మలికిపురం, మండపేట, చిలకలూరిపేట, బి కొత్త కోట, కల్లూరు, రొంపిచెర్లలో ఈ చిత్రం శతదినోత్సవం జరుపుకుంది.
నైజాం, సీడెడ్‌లో ఈ ఫీట్ సాధించకపోవడం కొంత నిరాశగా ఉన్నా, పుష్ప 2 ప్రభంజనంలోనూ దేవరను కొన్ని కేంద్రాల్లో నిలబెట్టడం నిజంగా అనూహ్యం.
లాభాల విషయంలో కొద్దిగా తగ్గుదల ఉన్నా, నష్టాల ప్రస్తావన మాత్రం ఎక్కడా లేదు.
దేవర విజయంతో తారక్ మరో బ్లాక్‌బస్టర్ తన ఖాతాలో వేసుకున్నారు. అరవింద సమేత తర్వాత సోలో హీరోగా ఇది పెద్ద విజయం.
ఇప్పుడు అందరూ దేవర 2 కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో తారక్ తదుపరి చిత్రం పూర్తైన తర్వాత ఈ సీక్వెల్ మొదలయ్యే అవకాశం ఉంది.
అంతేకాక, దేవర నెట్‌ఫ్లిక్స్‌లో 45 రోజులకే విడుదలై అక్కడ కూడా రికార్డులు సృష్టించింది.
డిజిటల్ స్ట్రీమింగ్ తర్వాత కూడా థియేటర్లలో కొనసాగడం ఒక అరుదైన ఫీట్.
ఇది జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్‌కి మరో నిదర్శనం అని చెప్పొచ్చు.