fbpx
Saturday, January 18, 2025
HomeMovie Newsఎన్టీఆర్ తో సీక్వెల్ ఎప్పుడు?

ఎన్టీఆర్ తో సీక్వెల్ ఎప్పుడు?

DEVARA-2-SCRIPT-WORK-STARTS-DECEMBER
DEVARA-2-SCRIPT-WORK-STARTS-DECEMBER

మూవీడెస్క్: యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా మొదటి భాగం మిశ్రమ రివ్యూలను అందుకున్నా కలెక్షన్ల పరంగా సూపర్ హిట్ అయ్యింది.

10 రోజుల్లోనే 466 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించిన ఈ చిత్రం, దసరా సెలవులు కలిసి రావడంతో 600 కోట్ల వరకు వెళ్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఈ భారీ విజయంతో దేవర 2 పై అంచనాలు కూడా భారీగా పెరిగాయి.

ఇందులో ఎన్టీఆర్ తండ్రి, కొడుకు పాత్రల్లో అదిరిపోయే నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.

ఫ్యాన్స్ ఇప్పుడు దేవర 2 లో ఇంకా పవర్ ఫుల్ యాక్షన్ సీక్వెన్స్‌లు ఉంటాయని ఆశిస్తున్నారు.

కొరటాల శివ కూడా రెండో పార్ట్ పై పరోక్షంగా క్లారిటీ ఇచ్చారు. డిసెంబర్‌ లో దేవర 2 స్క్రిప్ట్ వర్క్ మొదలవుతుందని ఎన్టీఆర్ తెలిపారు.

ఈ చిత్రం 2025లో షూటింగ్ ప్రారంభమై, 2026 ఆఖరులో లేదా 2027 ప్రారంభంలో విడుదల చేసే అవకాశం ఉందని ఇండస్ట్రీలో వినిపిస్తోంది.

ప్రస్తుతం ఎన్టీఆర్ వార్ 2 మరియు డ్రాగన్ సినిమాల షూటింగ్స్ లో బిజీగా ఉన్నాడు, కాబట్టి దేవర 2 పై అభిమానులు కొంతకాలం ఎదురు చూడాల్సి ఉంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular