మూవీడెస్క్: యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన దేవర కలెక్షన్స్ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకెళ్తోంది.
ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 10 రోజుల్లో 466 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఈ విషయాన్ని మేకర్స్ అఫీషియల్ గా పోస్టర్ ద్వారా కన్ఫర్మ్ చేశారు.
ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో దేవర కి దసరా సెలవులు అదనపు బూస్ట్ ఇచ్చాయి.
మొదటిరోజు వచ్చిన మిశ్రమ స్పందనతో భారీ నష్టాలు తప్పవని అనుకున్నప్పటికీ, ఎన్టీఆర్ పెర్ఫార్మెన్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.
చిన్న లోపాలను పక్కనపెడితే కథ, ఎన్టీఆర్ యాక్షన్ సీన్స్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యాయి.
ఫిక్షనల్ ప్రపంచంలో కథనాన్ని చక్కగా చెప్పడం సినిమాకి ప్లస్ అయ్యిందని విశ్లేషకులు చెబుతున్నారు.
ఇక పబ్లిక్ రెస్పాన్స్ స్పష్టంగా కలెక్షన్లలో కనిపిస్తోంది. వచ్చే రోజుల్లో కూడా ఈ సినిమా మంచి వసూళ్లను సాధించే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.