మూవీడెస్క్: ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవర సినిమాపై తెలుగులోనే కాకుండా బాలీవుడ్‌లో కూడా మంచి అంచనాలు ఉన్నాయి.
ఇటీవల ఆర్ఆర్ఆర్ మూవీతో బాలీవుడ్‌లో తారక్ భారీ ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నారు. ఈ క్రమంలో దేవర హిందీ మార్కెట్‌పై మరింత ఆసక్తి నెలకొంది.
కేవలం తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా సినిమా భారీ ఓపెనింగ్స్ సాధిస్తుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఈ సినిమాకు బాలీవుడ్ నుంచి జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్ వంటి తారలు ఉండటం సినిమా హిందీ మార్కెట్‌పై ప్రభావం చూపించనుంది.
ఎప్పుడూ మాస్ సినిమాలను ఆదరిస్తున్న బాలీవుడ్ ప్రేక్షకులు దేవర లో కూడా ఆ మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్‌ను ఎంజాయ్ చేస్తారని చెబుతున్నారు.
అదే సమయంలో సినిమా కంటెంట్ ప్రధాన పాత్ర పోషించనుందని తారక్, దర్శకుడు కొరటాల శివల ప్లాన్‌లో భాగమని అంటున్నారు.
ప్రమోషన్స్ విషయంలో కూడా తారక్ పక్కా స్కెచ్ వేసినట్లు కనిపిస్తోంది.
ముంబైలో దేవర ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ నిర్వహించటం, కరణ్ జోహార్‌తో చిట్‌చాట్ చేయడం, సందీప్ వంగా వంటి డైరెక్టర్లతో ఇంటర్వ్యూలు ఇవ్వడం వంటి ప్రయత్నాలు బాలీవుడ్ ప్రేక్షకులను ఆకర్షించడంలో భాగమని అంటున్నారు.
మొత్తానికి తారక్ వ్యూహాలు దేవర హిందీ మార్కెట్‌లో కూడా సక్సెస్ అవుతాయేమో చూడాలి.