fbpx
Friday, October 18, 2024
HomeMovie Newsదేవర.. ఆరంభంలోనే రికార్డులు సృష్టించేలా..

దేవర.. ఆరంభంలోనే రికార్డులు సృష్టించేలా..

DEVARA-PLANS-TO-EARN-EARLY-PROFITS
DEVARA-PLANS-TO-EARN-EARLY-PROFITS

మూవీడెస్క్: జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన దేవర సినిమా విడుదలకు ముందు నుంచే భారీ అంచనాలను నెలకొల్పింది.

కొరటాల శివ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం ప్రీ సేల్స్ ద్వారా రికార్డులు సృష్టిస్తోంది.

ముఖ్యంగా యునైటెడ్ స్టేట్స్ లోనే $2 మిలియన్ ప్రీ సేల్స్ వసూళ్లు సాధించింది. దీంతో, ఎన్టీఆర్ వరుసగా రెండు సినిమాలకు ఈ స్థాయిలో ప్రీ సేల్స్ సాధించిన హీరోగా నిలిచాడు.

ఇప్పటికే RRR తో.ఒకసారి ఈ రికార్డు అందుకున్నాడు. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమాకు ప్రీ రిలీజ్ బుకింగ్స్ వాణిజ్య రంగంలో సంచలనం రేపుతున్నాయి.

మొదటి రోజు వసూళ్లలో భారీ సంఖ్యలను నమోదుచేయడం ఖాయమని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. అంతేకాదు, వీకెండ్ లో కూడా సినిమా వసూళ్లు మరింత పెరిగే అవకాశముంది.

ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించగా, సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయకుడి పాత్రలో కనిపించబోతున్నాడు.

అనిరుధ్ రవిచందర్ సంగీతం ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రమే కాదు, సినీ అభిమానులు కూడా దేవర రిలీజ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular