మూవీడెస్క్: దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు అవ్వడం టాలీవుడ్‌లో పెద్ద చర్చకు దారి తీసింది. జూనియర్ ఎన్టీఆర్ అప్‌కమింగ్ మూవీ దేవర పై భారీ అంచనాల కారణంగా, అభిమానులు వేడుకకు భారీగా తరలివచ్చారు.
అయితే, ఈవెంట్‌కు అనుకున్నదానికంటే చాలా ఎక్కువ మంది హాజరుకావడంతో, సెక్యూరిటీ సమస్యలు ఏర్పడి చివరికి ఈవెంట్ రద్దు చేయాల్సిన పరిస్థితి వచ్చింది.
ఆ రోజు 5500 మందికి సామర్థ్యం ఉన్న ప్రాంగణంలో 4,000 పాసులు మాత్రమే ఇవ్వడం జరిగింది. కానీ 35,000 మంది అభిమానులు నోవాటెల్ వద్దకు చేరడంతో పరిస్థితి అదుపుతప్పింది.
ఇంటెలిజెన్స్ విభాగం సమాచారం మేరకు, అభిమానులు హోటల్ లోపలికి వెళ్లడానికి తొక్కిసలాట చేయడం, తలుపులు ధ్వంసం చేయడం వంటి ఘటనలు చోటు చేసుకున్నాయి.
ఈ పరిణామాలతో దేవర మేకర్స్ ఈవెంట్‌ను రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ వేడుక రద్దు కారణంగా పెద్ద నష్టం మేకర్స్ కు కాకుండా, నోవాటెల్ యాజమాన్యానికి జరిగిందని తెలుస్తోంది.
హోటల్ లో ధ్వంసమైన కుర్చీలు, గ్లాస్ డోర్లు, ఇతర హోటల్ వసతులకు భారీ నష్టం వాటిల్లింది. అందుకే నోవాటెల్ యాజమాన్యం దేవర టీమ్ పై రూ.33 లక్షల బిల్లు వేసినట్లు ప్రచారం జరుగుతోంది.
ఈ మొత్తం, ధ్వంసమైన 5,000 కుర్చీలు, గ్లాస్ ప్యానల్స్, మరియు బుక్ చేసిన రూమ్స్ వల్ల ఏర్పడిన నష్టాలు కలిపి ఉన్నాయని టాక్.
అయితే, దేవర మేకర్స్ ఈ మొత్తాన్ని తగ్గించాలని యాజమాన్యాన్ని కోరినట్లు సమాచారం. చర్చల అనంతరం, రూమ్స్ వల్ల కలిగిన నష్టాలను మినహాయించి, కొన్ని కోతలు పెట్టినట్లు తెలుస్తోంది.