మూవీడెస్క్: జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర మూవీ రివ్యూ. ఈ చిత్రం నేడు గ్రాండ్ గా పాన్ ఇండియా రేంజ్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ రెండు పాత్రల్లో నటించారు. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించగా సైఫ్ అలీ ఖాన్ పవర్ఫుల్ విలన్ పాత్రలో నటించారు.
ఇక సినిమా ఎలా ఉంది అనే విషయాన్ని రివ్యూలో తెలుసుకుందాం.
DEVARA-REVIEW-AND-RATING కథ:
ఈ సినిమా కథ సముద్రతీరంలోని నాలుగు ఊర్ల చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఒకప్పుడు దేశం కోసం రక్షణగా పని చేసిన ఆ గ్రామాలు ఊహించని విధంగా స్మగ్లింగ్ లోకి దిగుతాయి.
కొంతకాలం అనంతరం వాటికి పెద్దగా ఉన్న దేవర పాత్ర మీద మిగతా కథ నడుస్తుంది. సముద్రాన్ని కాపాడే వ్యక్తిగా ఉన్న దేవర, దొంగతనాలను వ్యతిరేకించడంతో చుట్టూ ఉన్న వాళ్ళే శత్రువులుగా మారతారు.
ఇక వారి నుంచి దేవరకు ఎదురైన ప్రమాదం ఏంటి? భయస్తుడు అయిన దేవర కొడుకు వర భవిష్యత్తులో మిగతా వారిని ఎలా అదుపులో పెట్టాడు అనేది మిగతా కథ.
విశ్లేషణ
దేవర కథ కాస్త రొటీన్ మాస్ మసాలా మూసలో నడుస్తుంది. అభిప్రాయం కొరటాల శివ చెప్పిన విధానం ఎప్పటిలానే ఉంది.
కథలో ముందే సీన్ ఎలా ముగుస్తుందనేది ఆడియన్స్ అంచనా వేయగలరు, కానీ ఎన్టీఆర్ స్క్రీన్ ప్రజెన్స్ మరియు మాస్ మూమెంట్స్‌తో సినిమా కొంత ఆకర్షణీయంగా మారుతుంది.
ఇక కథా పరంగా కొరటాల శివ పూర్తి స్థాయి కంబ్యాక్ ఇవ్వలేకపోయినా, ఎన్టీఆర్ మాత్రం తన నటనతో ప్రతి సన్నివేశాన్ని మరింత బలంగా నిలబెట్టాడు.
సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో అంతగా ప్రభావం చూపించలేదని అనిపిస్తుంది. జాన్వీ కపూర్ పాత్ర కూడా పెద్దగా సీన్ లేదనే చెప్పాలి.
సినిమాలో చాలా పాత్రలు హీరో ఎలివేషన్స్ కోసమే ఉన్నట్లు అనిపిస్తుంది కానీ ఎక్కడా కథకు కనెక్షన్ ఉన్నట్లు అనిపించదు.
అనిరుద్ సంగీతం మరియు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు ఒక పెద్ద ప్లస్ పాయింట్.
కొన్ని వీక్ సన్నివేశాలను కూడా తన సంగీతం ద్వారా పుంజుకునేలా చేశారు. ముఖ్యంగా ఇంటర్వెల్ సీక్వెన్స్ ప్రేక్షకులను కుర్చీలకు కట్టిపడేసేలా ఉంది.
సినిమాటోగ్రఫీ కూడా మంచి ప్రమాణాలను అందించినా, కొన్ని సన్నివేశాల్లో మరింత మెరుగ్గా ఉండాల్సిన అవసరం ఉందనిపిస్తుంది.
ప్రొడక్షన్ వాల్యూస్ ఓ మోస్తరు స్థాయిలో ఉండగా, విజువల్ ఎలిమెంట్స్ కొన్ని చోట్ల అద్భుతంగా ఉన్నాయి.
మొత్తానికి, దేవర సినిమా ఓ వర్గం ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు మంచి ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తుంది. కానీ కొరటాల శివ తన వర్క్ విషయంలో అంచనాలను అందుకోలేకపోయారు.
ప్లస్ పాయింట్స్
జూనియర్ ఎన్టీఆర్
అనిరుధ్ మ్యూజిక్
మైనస్ పాయింట్స్
రొటీన్ స్టోరీ
సెకండ్ హాఫ్
బలం లేని విలన్ క్యారెక్టర్స్
హీరోయిన్
Devara Movie Review & Rating: 2.5/5