fbpx
Thursday, September 19, 2024
HomeMovie Newsదేవర.. అర్ధరాత్రి నుంచే హంగామా మొదలు

దేవర.. అర్ధరాత్రి నుంచే హంగామా మొదలు

DEVARA-TO-HIT-SCREENS-ON-SEPTEMBER-27
DEVARA-TO-HIT-SCREENS-ON-SEPTEMBER-27

మూవీడెస్క్: యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న భారీ ప్రాజెక్ట్ దేవర సెప్టెంబర్ 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది.

ఈ సినిమాతో ఎన్టీఆర్ మరొకసారి తన యాక్షన్, మాస్ అవతార్‌లో అలరించనున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం, యాక్షన్ ప్యాక్డ్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకులను కట్టిపడేసేలా రూపొందింది.

ఇప్పటికే విడుదలైన రెండు పాటలు చిత్రంపై భారీ అంచనాలు రేపాయి. అనిరుద్ రవిచందర్ సంగీతం దేవరకు ప్రధాన బలం అవుతుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ఇదిలా ఉంటే, సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయకుడిగా, జాన్వీ కపూర్ ప్రధాన పాత్రలో నటించడం వల్ల బాలీవుడ్‌లో కూడా దేవరకి మంచి క్రేజ్ ఉందని అంటున్నారు.

ఆర్ఆర్ఆర్ తో ఎన్టీఆర్ హిందీ ప్రేక్షకుల్లో కూడా మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. దీంతో ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో భారీ వసూళ్లు సాధించడానికి అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

ఇంకా ఆసక్తికరమైన విషయమేమిటంటే, దేవర సినిమా మిడ్ నైట్ షోలతోనే థియేటర్లలో సందడి చేయనుంది.

సెప్టెంబర్ 27 అర్ధరాత్రి 1:08 గంటలకి సినిమా మొదటి షో ప్రారంభమవుతుందన్న వార్త ఫ్యాన్స్ మధ్య హైప్ క్రియేట్ చేస్తోంది.

త్వరలో చిత్ర బృందం నుంచి దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular