మూవీడెస్క్: తండేల్ ప్రాజెక్ట్ మొదటిదశలో దేవిశ్రీ ప్రసాద్ ను సంగీత దర్శకుడిగా ఎంపిక చేయలేదని నిర్మాత అల్లు అరవింద్ ఇటీవల వెల్లడించారు.
పుష్ప 2తో బిజీగా ఉన్నందున, తమ సినిమాకు న్యాయం చేయలేడని భావించారు. కానీ బన్నీ సూచనతో తిరిగి డిఎస్పిని తీసుకోవాలని నిర్ణయించుకున్నారు.
ఇప్పుడు ఆ నిర్ణయం సరిగ్గా పని చేసింది. తండేల్ సక్సెస్‌లో ప్రధాన పాత్ర పోషించినది పాటలే.
ముఖ్యంగా బీజీఎమ్ విషయంలో దేవి తన వింటేజ్ మార్క్ చూపించి, ప్రేక్షకుల ఎమోషన్‌కు బాగా కనెక్ట్ అయ్యాడు.
ఆయన స్థానంలో మరొకరిని తీసుకుని ఉంటే ఇంత ప్రభావం ఉండేది కాదేమోనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
పుష్ప 2 ఆల్బమ్ ఇటీవల హిట్ సినిమాల మ్యూజిక్ కంటే బాగా ఆకట్టుకోవడం మరో ఉదాహరణ. ఇప్పుడు తండేల్ రూపంలో దేవి మరో చార్ట్ బస్టర్ అందుకున్నాడు.
ఏప్రిల్‌లో గుడ్ బ్యాడ్ అగ్లీ ఆల్బమ్ రానుండగా, మాస్ మ్యూజిక్‌కు ఇది పెద్ద హిట్ అవుతుందని అంచనా. కుబేర పాటలపై మంచి అంచనాలున్నాయి.
శేఖర్ కమ్ముల సినిమాకు దేవి ఇచ్చిన ట్యూన్స్ కొత్తగా ఉంటాయని భావిస్తున్నారు.
అయితే, ఫ్యాన్స్ ప్రధానంగా ఉస్తాద్ భగత్ సింగ్ కోసం ఎదురుచూస్తున్నారు.
గబ్బర్ సింగ్ కాంబోగా పవన్, డిఎస్పి మళ్లీ మాస్ మ్యూజిక్ ఇవ్వనున్నారని భావిస్తున్నారు.
రామ్ చరణ్ RC17కు దేవి పనిచేయడం ఖాయంగా మారితే, రంగస్థలం మ్యాజిక్ మరోసారి రిపీట్ కావొచ్చని అభిమానులు ఆసక్తిగా ఉన్నారు.