మూవీడెస్క్: డిసెంబర్‌లో విడుదల కానున్న పుష్ప 2 ది రూల్‌కి సంబంధించి దేవిశ్రీ ప్రసాద్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ విషయంలో మార్పులు చర్చనీయాంశమయ్యాయి.
దేవి స్థానంలో తమన్‌ను తీసుకురాబోతున్నారనే వార్తలు అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తించాయి.
పుష్ప 1 ది రైజ్‌లో దేవిశ్రీ ఇచ్చిన BGM పై కొన్ని విమర్శలు రావడంతో, సుకుమార్, బన్నీలు ఈసారి మెరుగైన అవుట్‌పుట్ కోసం కొత్త మార్గాలను పరిశీలిస్తున్నారని సమాచారం.
దేవిశ్రీ ప్రసాద్ ఈ ప్రాజెక్టు కోసం ఇతర పనులన్నింటిని పక్కనబెట్టి అనేక వెర్షన్లు అందించినప్పటికీ, మేకర్స్ పూర్తిగా సంతృప్తి చెందలేదట.
చివరికి సురక్షితమైన మార్గం కోసం తమన్ లేదా అజనీష్ లోకనాథ్ పేర్లు కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం.
వీరిద్దరి నుంచి కూడా BGM ట్రైల్స్ తీసుకుని, అందులో ఎవరి అవుట్‌పుట్ బాగుంటే వారిని ఫైనల్ చేయనున్నారట.
సుకుమార్ సాధారణంగా దేవితోనే పని చేసే విధానాన్ని మార్చిన సందర్భాలు లేకపోయినా, ఈసారి మాత్రం పెద్ద చిత్రమైన పుష్ప 2 విషయంలో ఏ చిన్న లోపం కూడా ఉండకూడదనే జాగ్రత్తతో ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ వార్తలో ఎంతవరకు నిజమో తెలియదు కానీ, ప్రమోషన్లు, ట్రైలర్ లాంచ్ వంటి పనులు జరుగుతున్న సమయంలో కొత్త BGM కంపోజర్‌పై నిర్ణయం తీసుకోవడం ఫ్యాన్స్‌లో ఆసక్తి రేపుతోంది.