fbpx
Sunday, January 19, 2025
HomeMovie Newsధనూష్ 'జగమే తంత్రం' ట్రైలర్

ధనూష్ ‘జగమే తంత్రం’ ట్రైలర్

Dhanush JagameThandiram TrailerRelease

టాలీవుడ్: ఎన్నో రోజులుగా ఓటీటీ రిలీజ్ లేదా థియేటర్ రిలీజ్ గొడవల మధ్య నలిగిన తమిళ స్టార్ హీరో ధనుష్ సినిమా ఎట్టకేలకు ఈ నెలలో విడుదల అవనుంది. ఈ రోజు ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. సూపర్ స్టార్ రజినీకాంత్ తో ‘పేట’ సినిమాని రూపొందించిన కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం లో ధనూష్ హీరోగా ‘జగమే తంత్రం’ అనే సినిమా రూపొందింది. ఎన్నో రోజుల రిలీజ్ వివాదం తర్వాత విడుదలైన ఈ సినిమా ట్రైలర్ ఆకట్టుకుంది.

ఒక అమాయకంగా కనిపించే తమిళనాడు లోని ఒక మామూలు వ్యక్తి తన పగ తీర్చుకోవడానికో, లేదా మరేదైనా కారణంతో లండన్ కి వెళ్లి అక్కడ డాన్ గా ఎదిగినట్టు ట్రైలర్ చూస్తే అర్ధం అవుతుంది. ధనూష్ ఈ సినిమాలో వేరే వేరే గెటప్ లలో కనపడతాడు. మరి ధనుష్ తమిళనాడు నుండి లండన్ కి ఏ కారణం చేత వెళ్లాల్సి వచ్చింది అనేది సినిమా చూస్తేనే అర్ధం అవుతుంది.

ట్రైలర్ లో చూపించిన విజువల్స్, సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంది. ట్రైలర్ లో వినిపించిన మ్యూజిక్ సినిమాని మరో మెట్టు ఎక్కించింది అని చెప్పుకోవచ్చు. సంతోష్ నారాయణన్ కర్ణన్ లాగానే ఈ సినిమాకి కూడా మంచి బూస్టింగ్ ఇచ్చే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చాడు. వై నాట్ స్టూడియోస్ బ్యానర్ పై ఎస్.శశికాంత్ ఈ సినిమాని నిర్మించారు. జూన్ 18 న ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ ఓటీటీ లో విడుదల అవనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular