కోలీవుడ్: కోలీవుడ్ హీరో ధనుష్ ఇపుడు ఫుల్ ఫార్మ్ లో ఉన్నాడు. సౌత్ ఇండియా లోనే కాకుండా బాలీవుడ్ లో మరియు హాలీవుడ్ లో కూడా సినిమాలు చేస్తూ మంచి సక్సెస్ రేట్ తో దూసుకెళ్తున్నారు. ప్రస్తుతం ఈ హీరో డైరీ ఒక మూడు సంవత్సరాల వారికి ఖాళీ లేదు. ఈ హీరో ‘కర్ణన్’ అనే ఒక సినిమాలో నటిస్తున్నాడు. ఈరోజు ఈ సినిమా విడుదల అప్ డేట్ ఒకటి విడుదల చేసారు. ఏప్రిల్ లో ఈ సినిమా విడుదల అవనుందని ప్రకటిస్తూ ఒక చిన్న వీడియో కూడా విడుదల చేసారు. ఈ హీరో నుండి కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం లో రూపొందిన ‘జగమే తంత్రం’ కూడా విడుదలకి సిద్ధంగా ఉంది.
‘పరియేఱుమ్ పెరుమాళ్’ లాంటి సినిమాని రూపొందించి విమర్శకుల ప్రశంసలు పొందిన మారి సెల్వరాజ్ ఈ కర్ణన్ అనే సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ రోజు విడుదల చేసిన వీడియో లో ధనుష్ లుక్ కూడా రెగ్యులర్ సినిమాల్లాగా కాకుండా మరోసారి ఒక విలేజ్ రోల్ లో కనిపించనున్నాడు. వీడియో లో ఒక గుర్రం, ఒక ఏనుగు, ఒక కుక్క ని చూపించి ధనుష్ ఒక కొండా మీదకి ఎక్కి కత్తి పట్టుకొని నిల్చోవునే సీన్ చూపించారు. దీనికి బ్యాక్ గ్రౌండ్ లో సంతోష్ నారాయణన్ మ్యూజిక్ అద్భుతంగా కుదిరించాని చెప్పచ్చు. వీ క్రియేషన్స్ బ్యానర్ పై కలైపులి ఎస్.థాను ఈ సినిమాని నిర్మిస్తున్నారు.