కోలీవుడ్: కోలీవుడ్ బ్రదర్స్ ధనూష్ మరియు సెల్వ రాఘవ మరొక సారి కలిసి పని చేస్తున్నారు. వైవిధ్యమైన సినిమాల్లో నటిస్తూ ధనూష్ మంచి పేరు తెచ్చుకుంటున్నాడు. అంత కన్నా వైవిధ్యమైన సినిమాలు తియ్యడం లో సెల్వ రాఘవ కూడా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. తెలుగులో సెల్వ రాఘవ వెంకటేష్ తో ‘ఆడవారి మాటలకి అర్థాలే వేరులే’ ఒకే సినిమా చేసాడు. కానీ తమిళ్ సినిమాలని ఫాలో అయ్యే వారికీ సెల్వ రాఘవ సినిమాల గురించి ఎక్కువగా తెలుస్తుంది. ప్రస్తుతం వీరిద్దరి కాంబినేషన్ లో ఒక సినిమా రూపొందుతుంది. ఈ రోజు ఈ సినిమాకి సంబందించిన టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసారు.
ధనూష్, సెల్వరాఘవన్ కలిసి ఇదివరకే మూడు సినిమాలకి కలిసి పని చేసారు. ఇపుడు వీళ్ళ కాంబినేషన్ రూపొందుతున్న నాల్గవ సినిమాని ‘నాన్ వరువేన్’ అనే టైటిల్ తో రూపొందిస్తున్నారు. ఈ రోజు ఈ సినిమా టైటిల్ ప్రకటన తో పాటు ఫస్ట్ లుక్ కూడా విడుదల చేసారు. ఫస్ట్ లుక్ లో ధనుష్ స్టైలిష్ గా నోట్లో సిగార్ కాలుస్తూ ఉన్నాడు. వెనకాల తగలబడిపోతున్న ఒక ఇల్లు చూపించారు. ఫస్ట్ లుక్ ప్రకారం ఇదొక గ్యాంగ్ స్టర్ కథ అని ఊహించవచ్చు . వీ క్రియేషన్స్ బ్యానర్ పై ‘కలైపులి ఎస్ థాను’ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. యువన్ శంకర్ రాజా వీళ్ళిద్దరితో మరో సారి ఈ సినిమాకి పని చేయనున్నాడు. వీళ్లిద్దరి కాంబినేషన్ లో యుగానికి ఒక్కడు సీక్వెల్ కూడా ప్రకటించారు. కానీ ఆ సినిమా 2024 వరకు సిద్ధం అవుతుంది.