కోలీవుడ్: మొన్న ప్రకటించిన జాతీయ అవార్డులతో రెండు సార్లు నేషనల్ అవార్డు విన్నర్ గా పేరొందిన ధనూష్ ప్రస్తుతం ‘కర్ణన్’ అనే సినిమాలో నటిస్తున్నాడు. పరియేఱుమ్ పెరుమాళ్ లాంటి సినిమాని డైరెక్ట్ చేసిన మారి సెల్వరాజ్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. ఫస్ట్ లుక్ పోస్టర్స్, టీజర్ తో ఆకట్టుకున్న కర్ణన్ టీం టీజర్ ని విడుదల చేసింది.
తిరునెల్వేలి లో జరిగిన ఒక రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ బేస్ చేసుకొని ఈ సినిమాని రూపొందించినట్టు సినిమా టీం పేర్కొంది. రెండు నిమిషాల నిడివి ఉన్న ఈ టీజర్ ప్రతీ ఫ్రేమ్ ఆకట్టుకునేలా ఉంది. కత్తి పట్టుకుని, గుర్రపు స్వారీ చేస్తూ గ్రామం లో ఉండే పోరాట యోధుడిగా ధనూష్ ఈ సినిమాలో కనిపించనున్నాడు. యోధుడు అంటే పెద్ద జుట్టు, యుద్దానికి వెళ్లే కాస్ట్యూమ్స్ కాకుండా ఊళ్లలో ఉండే చొక్కా, లుంగీ గెటప్స్ లో ఉంది ధనూష్ తన మార్క్ చూపించాడు. టీజర్ లో వచ్చిన సంభాషణల ప్రకారం ఒక ఊరి ప్రజలంతా ఒక ఫైట్ లో ఓడిపోయి తమకి ఉన్న ఏకైన ఆశ కర్ణన్ అని కర్ణన్ కోసం ఎదురుచూస్తూ కర్ణన్ రాగానే ‘ఏ ఒక్కరిని వొదిలిపెట్టద్దు కర్ణా’ అంటూ హీరో పాత్ర ఎలా ఉండబోతుంది అని టీజర్ ద్వారా చూపించారు.
కొంచెం ఆర్ట్స్ ని, విలెజ్ ని , హార్స్ రైడింగ్ ని , యాక్షన్ సీన్స్ ని టీజర్ ద్వారా బాగానే ప్రెసెంట్ చేసి సినిమాలో ఇంకేదో ఉందని ప్లాట్ మొత్తం రివీల్ చేయకుండా మైంటైన్ చేయగలిగాడు డైరెక్టర్. టీజర్ లో చూపించిన ప్రతీ సీన్ ఆకట్టుకుంది. సినిమాటోగ్రఫీ ఈ టీజర్ ని ప్రత్యేకంగా నిలబెట్టింది. కేవలం సినిమాటోగ్రఫీ మాత్రమే కాకుండా బ్యాక్ గ్రౌండ్ లో సంతోష్ నారాయణన్ మ్యూజిక్ వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఈ సినిమాలో హీరోయిన్ గా రాజిష విజయ అనే మలయాళీ నటి నటిస్తుంది. కలైపులి ఎస్.థాను నిర్మిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 9 న థియేటర్లలో విడుదల అవనుంది.