స్పోర్ట్స్ డెస్క్: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ గురించి వెస్టిండీస్ క్రికెటర్ డ్వేన్ స్మిత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఐపీఎల్‌లో ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లకు ప్రాతినిధ్యం వహించిన స్మిత్.. తనకు సీఎస్‌కే అంటే చాలా ఇష్టమని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.
ధోనీ గురించి మాట్లాడుతూ.. “అతడు బాస్‌లా ఉంటాడు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా కూల్‌గా ఉంటుంది. జట్టులోని ఆటగాళ్ల బలహీనతలు, బలాలను అర్థం చేసుకునే మాస్టర్” అని కొనియాడారు.
అయితే ధోనీకి కోపం రావడం చాలా అరుదు అని చెప్పిన స్మిత్.. కొన్ని సందర్భాల్లో మాత్రం కోపం చూసానని గుర్తు చేశారు.
“ఒకసారి అశ్విన్ ఓ ఈజీ క్యాచ్ వదిలేశాడు. వెంటనే ధోనీ అతన్ని స్లిప్ నుంచి తీసేసి వేరే చోట పెట్టాడు. అదే అతన్ని కోపంగా చూడటం మొదటిసారి” అని చెప్పారు. మరోసారి హోటల్ సిబ్బంది ధోనీ ఆర్డర్ చేసిన ఫుడ్ ఇవ్వకపోవడంతో, వెంటనే హోటల్ మార్చేశాడని వెల్లడించారు.
ధోనీ ఆటగాళ్లపై నమ్మకంతో పాటు, క్రమశిక్షణను కూడా పక్కాగా పాటించేవారని తెలిపారు. అతని లీడర్‌షిప్‌లో ఆడే అనుభవం తనకు ఎప్పటికీ మర్చిపోలేని విషయమని స్మిత్ చెప్పాడు.
dhoni angry, dwayne smith, csk moments, ipl stories, msd leadership,