స్పోర్ట్స్ డెస్క్: చెన్నై సూపర్ కింగ్స్ (CSK) అభిమానులకు మళ్లీ ఆనందించేందుకు కారణం ఏర్పడింది. మిస్టర్ కూల్ ఎంఎస్ ధోనీ మరోసారి జట్టుకు కెప్టెన్‌గా మారనున్నారు. రేపు చెపాక్ వేదికగా జరిగే ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో ధోనీ సారథ్యం వహించనున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం కెప్టెన్‌గా ఉన్న రుతురాజ్ గైక్వాడ్ ఇటీవల రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో ఎడమ మోచేతికి గాయపడటంతో, ఢిల్లీ మ్యాచ్‌కు అందుబాటులో ఉండకపోవచ్చని సమాచారం. దీంతో జట్టు యాజమాన్యం తిరిగి ధోనీనే కెప్టెన్సీ బాధ్యతలతో ముందుంచనుంది.
ఐపీఎల్‌లో ఇప్పటికే ఐదు ట్రోఫీలు అందించిన ధోనీ, గత ఏడాది సారథ్య బాధ్యతల నుంచి తప్పుకుని యువ ఆటగాడు రుతురాజ్‌కు అవకాశం ఇచ్చారు. కానీ తాజా పరిస్థితుల్లో మళ్లీ పగ్గాలు ఆయన చేతుల్లోకి వచ్చే అవకాశముంది.
చెన్నై ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లో కేవలం ఒక విజయం మాత్రమే సాధించి పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో ఉంది. దాంతో జట్టుకు ధోనీ నాయకత్వం మళ్లీ ఊపునిస్తుందన్న ఆశాభావం అభిమానుల్లో నెలకొంది.
సొంత మైదానమైన చెపాక్ స్టేడియంలో ధోనీ నాయకత్వంలో జట్టు తలపడటమే కాకుండా, ఈ మ్యాచ్ CSK తిరిగి గెలుపుబాట పట్టే మ్యాచ్ కావాలని ఆశిస్తున్నారు.
ఫిట్‌నెస్ పరంగా ధోనీ సిద్ధంగా ఉండటంతో, యాజమాన్యం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ధోనీ మళ్లీ మైదానంలో కెప్టెన్‌గా కనిపించబోతున్న వార్తతో సోషల్ మీడియా ఇప్పటికే హిట్ అవుతోంది.