స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్ 2025లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడుతున్న ధోనీ బ్యాటింగ్ ఆర్డర్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ధోనీ తొమ్మిదో స్థానంలో క్రీజులోకి రావడంపై అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
మ్యాచ్‌ను మార్చే సామర్థ్యం ఉన్న ధోనీ ఎందుకు చివర్లో వస్తున్నారనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఈ విషయంపై టీమిండియా మాజీ ఆటగాడు మనోజ్ తివారీ తాజాగా స్పందించారు.
ధోనీ బ్యాటింగ్ ఆర్డర్‌పై క్లియర్ గా విమర్శలు చేశారు. “ధోనీ ఇలా తక్కువ ఓవర్లలో వస్తే, జట్టుకు నష్టం తప్పదు” అని అన్నారు. ముఖ్యంగా CSK మేనేజ్‌మెంట్ ధోనీకి ముందుగా చెప్పాల్సిన బాధ్యత ఉందని పేర్కొన్నారు.
“ధోనీని ఎవ్వరూ ఎదురుగా నిలబెట్టలేరా? ఓ ఆటగాడిగా కాదు, ఓ నాయకుడిగా తన ఆలోచనల్లో మార్పు అవసరం” అని తివారీ వ్యాఖ్యానించారు. ధోనీ నిర్ణయాలు తుది నిర్ణయాలుగా మారడం టీమ్‌ను ఇబ్బందుల్లో పడేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.
బ్యాటింగ్ ఆర్డర్‌లో ధోనీ ముందుగా రావాలని, జట్టుకు గెలుపు సాధించే విధంగా ఆడాలని సూచించారు. అభిమానులు కూడా ధోనీ నుంచి అలాంటి పోరాటమే ఆశిస్తున్నారని తివారీ తేల్చిచెప్పారు.