టాలీవుడ్ బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా, క్రికెట్ లెజెండ్ ఎంఎస్ ధోని కలిసి ఓ సెన్సేషనల్ యాడ్ చేశారు. బ్యాట్‌తో స్టేడియంలో గర్జించే ధోని, ఈసారి కెమెరా ముందు యాక్టింగ్‌లో తన స్కిల్స్ చూపించాడు.
యానిమల్ సినిమాలోని క్లైమాక్స్ సీన్ సహా కొన్ని మాస్ మూమెంట్స్‌ను ఈ యాడ్‌లో రీక్రియేట్ చేశారు. ముఖ్యంగా రణ్‌బీర్ కపూర్ కారులో దిగే స్టైల్, సైకిల్ మీద స్లో మోషన్ ను కూడా మహీ అచ్చం అలాగే ఫాలో అయ్యాడు.
ఈ యాడ్‌ను ఎలక్ట్రిక్ సైకిల్ బ్రాండ్ ఇ మోటరాడ్ కోసం తెరకెక్కించారు. అయితే ఇది యానిమల్ కాంటెంట్‌ను ఫన్నీ మోడ్‌లో ప్రెజెంట్ చేయడం విశేషం. ఇందులో ధోని చేసిన బోల్డ్ సీన్ గురించి నెట్టింట హాట్ టాపిక్ నడుస్తోంది. రణ్‌బీర్ చేసిన ఇంటెన్స్ స్టెప్‌ను ధోని స్టయిలిష్‌గా ఫాలో అవ్వడంతో, అభిమానులు ఆయనకు సినిమా ఛాన్స్ వస్తుందా? అనే చర్చ మొదలైంది.
ప్రస్తుతం సందీప్ వంగా స్పిరిట్ సినిమా కోసం ప్రభాస్‌తో ప్రీ-ప్రొడక్షన్ పనులు ప్రారంభించాడు. మరోవైపు, ధోని ఐపీఎల్ 2025 కోసం సిద్ధమవుతున్నాడు. క్రికెట్ తర్వాత మహీ సినీ నటనలోకి వస్తాడా? అనే ఉత్కంఠ అభిమానులను ఊరిస్తోంది.
https://www.instagram.com/reel/DHVPj3IMg2H/?igsh=MWRndWZmNWY1cndtaQ==