న్యూఢిల్లీ: నీతి ఆయోగ్ నుండి ఆపిల్, గూగుల్, డ్రాప్‌బాక్స్ వంటి క్లౌడ్ స్టోరేజ్ కంపెనీలకు భారీ షాక్ తగిలింది. ఆత్మనిర్భర్ భారత్ లో భాగంగా డీజీబాక్స్ అనే స్వదేశీ క్లౌడ్ స్టోరేజ్, మేనేజ్మెంట్ ప్లాట్‌ఫాంను నీతిఆయోగ్ ప్రారంభించింది. దీనికోసం డీజీబాక్స్ బృందంతో కలిసి పనిచేసినట్లు నీతి ఆయోగ్ సిఇఓ అమితాబ్ కాంత్ ప్రకటీంచారు.
ఈ డిజీ బాక్స్ లో రా ఫైల్స్, ఫోటోలు, ఈ-డాక్యుమెంట్స్ లాంటి వాటిని నిల్వ ఉంచుకోవచ్చు. ఈ సేవలు వెబ్, ఆండ్రాయిడ్ వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయని త్వరలో ఐఓఎస్ వెర్షన్ కూడా అందుబాటులోకి రానుందని తెలిపింది. డీజీబాక్స్ లో ఆన్-డిమాండ్, రియల్ టైమ్ యాక్సెస్, ఎడిటింగ్ వంటి ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.
డీజీబాక్స్ క్లౌడ్ స్టోరేజ్ సేవలను ఉపయోగించడానికి వెబ్ సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా ఖాతా క్రియేట్ చేయాల్సి ఉంటుంది. దీనికోసం మీ పేరు, ఇమెయిల్ చిరునామా, ఫోన్ నంబర్, నివాస చిరునామా వంటి వాటిని నమోదు చేయాల్సి ఉంటుంది. తరువాత డీజీబాక్స్ వెబ్ సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా మీ స్వంత ఫైల్‌లను సేవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు మీ ఫైల్స్ ను ఎప్పుడు కావాలంటే అప్పుడు యాక్సెస్ చేసుకోవచ్చు.
ఈ సేవలు పొందటం కోసం డీజీబాక్స్ యొక్క నెల, వార్షిక ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. దీన్ని ఉచితంగా పొందడానికి కూడా 20జీబీ స్టోరేజ్ అందుబాటులో ఉంది. ఎస్ఎస్ఎల్ సెక్యూరిటీ, జీమెయిల్ ఇంటిగ్రేషన్ వంటి ఫీచర్లు కూడా లభించనున్నాయి. ఫ్రీ యూజర్లు 2జీబీ సైజు ఉన్న ఫైల్స్ ఒకేసారి షేర్ చేసుకోవచ్చు. అదే నెలకు రూ.30 రూపాయలు చెల్లిస్తే 5టీబీ స్టోరేజ్ స్పేస్ లభిస్తుంది. వీరు 10 జీబీ సైజ్ ఉన్న ఫైల్స్ కూడా ఒకేసారి అప్లోడ్ చేసుకోవచ్చు.