మూవీడెస్క్: తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (టీఎఫ్‌డీసీ) ఛైర్మన్‌గా ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు నియమితులయ్యారు.
ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధికారికంగా ప్రకటించారు. దిల్ రాజు ఈ బాధ్యతను వచ్చే రెండు సంవత్సరాలపాటు నిర్వహించనున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో సినీ పరిశ్రమ అభివృద్ధికి దిల్ రాజు అనుభవం ఎంతో ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.
ఇప్పటికే ఆయన నిర్మాణంలో వచ్చిన పలు సినిమాలు నేషనల్ స్థాయిలో గుర్తింపు పొందాయి.
టీఎఫ్‌డీసీ ఛైర్మన్‌గా దిల్ రాజు తన అనుభవంతో పరిశ్రమను మరింత ముందుకు తీసుకెళ్లాలని ప్రతిష్టాత్మక ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
గతంలో ఆయన రాజకీయ అరంగేట్రంపై పలు వార్తలు వచ్చాయి. కాంగ్రెస్ తరఫున ఎంపీ లేదా ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని ఊహాగానాలు వినిపించాయి.
కానీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిల్ రాజు అడుగుపెట్టలేదు. రాజకీయ పరిణామాల్లో తెర వెనుక ఉండి కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చినట్టు అప్పట్లో చర్చలు జరిగాయి.
ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆయనకు ఈ కీలక పదవిని ఇవ్వడం సినీ, రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది.
సినీ పరిశ్రమలో ప్రగతి సాధించేందుకు దిల్ రాజు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అందరూ ఆశిస్తున్నారు.