మూవీడెస్క్: తెలంగాణలో కొత్త సినిమాలకు టికెట్ రేట్లు పెంపుపై చర్చలు జరుగుతున్న నేపథ్యంలో నిర్మాత దిల్ రాజు కీలక వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో టికెట్ రేట్ల పెంపుపై స్పష్టత ఇచ్చారని, పరిశ్రమకు వ్యతిరేకం కాదని తెలిపారు.
గతంలో జరిగిన సంధ్య థియేటర్ ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారని అన్నారు.
“సీఎం గారు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు. కానీ కొన్ని అపశృతులు పునరావృతం కాకుండా చూడాలని తెలిపారు.
త్వరలోనే ఆయన్ను కలిసి పరిశ్రమ సమస్యలు వివరిస్తాను. తుది నిర్ణయం ప్రభుత్వానిదే,” అని రాజు ప్రెస్ మీట్‌లో వివరించారు.
అంతేకాకుండా, తనపై ఉన్న బాధ్యతలు గుర్తు చేస్తూ, “తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా నాకు అనేక పనులు ఉన్నాయి.
ప్రభుత్వానికి, పరిశ్రమకు మధ్య వారధిగా ఉంటాను,” అని స్పష్టం చేశారు.
అయితే, సంక్రాంతి బరిలో ఉన్న తమ చిత్రం సంక్రాంతికి వస్తున్నాం గురించి ప్రస్తావిస్తూ, “ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్‌ను థియేటర్లకు రప్పించనుంది.
టికెట్ రేట్ల అంశంపై పాజిటివ్ అప్డేట్ వస్తే, ఇంకా మెరుగైన పరిస్థితి ఉంటుంది,” అని ధీమా వ్యక్తం చేశారు.