టాలీవుడ్‌లో మల్టీస్టారర్ సినిమాల జోరు మళ్లీ మొదలైంది. తాజాగా ఈ ట్రెండ్‌ను ముందుకు తీసుకెళ్లేందుకు నిర్మాత దిల్ రాజు – డైరెక్టర్ హనీఫ్ కలయికలో ఓ భారీ ప్రాజెక్ట్ సిద్ధమవుతోంది. ‘మార్కో’ సినిమాతో మాస్ పుల్ చూపించిన హనీఫ్, ఇప్పుడు టోటల్ యాక్షన్ డ్రామాతో దేశవ్యాప్తంగా ప్రేక్షకుల మనసు గెలవాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాడు.
ఇప్పటికే కథ సిద్ధంగా ఉంది. కథలో రెండు ప్రధాన పాత్రలకు స్కోప్ ఎక్కువగా ఉండటంతో మల్టీస్టారర్‌గా తెరకెక్కించేందుకు నిర్ణయం తీసుకున్నారు. అయితే ఒకవైపు తెలుగు హీరోలపై దృష్టి సారిస్తూనే, మరోవైపు బాలీవుడ్, తమిళం నుంచి ఓ స్టార్‌ను తీసుకురావాలని దిల్ రాజు యోచిస్తున్నాడు. ఎందుకంటే, ఈ ప్రాజెక్ట్‌ను పాన్ ఇండియా స్థాయిలో తీసుకెళ్లడమే నిర్మాతల టార్గెట్.
కథలో యాక్షన్‌తో పాటు బలమైన ఎమోషనల్ డ్రైవ్ ఉండటంతో, ఇది కేవలం కమర్షియల్ ఎంటర్‌టైనర్ కాదని, ఒక థీయోట్రికల్ ఎక్స్‌పీరియెన్స్ అయ్యే అవకాశం ఉందని టాక్. మ్యూజిక్ డైరెక్టర్, కెమెరామెన్ వంటి టెక్నికల్ టీం కోసం కూడా ఇప్పటికే చర్చలు ప్రారంభమయ్యాయని సమాచారం. అయితే ఇప్పుడు ప్రధాన అడ్డంకి కాస్టింగ్‌దే. ఇద్దరు హీరోల ఎంపిక పూర్తయితే సినిమా సెట్స్‌పైకి వెళ్లేందుకు సిద్ధంగా ఉందని తెలుస్తోంది.
దిల్ రాజుకు మల్టీస్టారర్ సినిమాలపై మంచి అనుభవం ఉంది. ‘సీతమ్మ వాకిట్లో’, ‘ఎఫ్2’ వంటి విజయవంతమైన ప్రయోగాల తరువాత, ఈసారి ఆయన మాస్ బేస్డ్, యాక్షన్ హైప్లో నడిచే మల్టీస్టారర్‌ను రూపొందించేందుకు సిద్ధమవుతున్నారు. హనీఫ్ కూడా పూర్తి సమయాన్ని ఈ స్క్రిప్ట్‌కే కేటాయిస్తున్నాడు. ఇప్పుడు ప్రశ్న ఒక్కటే – హీరోలు ఎవరూ? ఎప్పుడైతే ఈ కాస్టింగ్ తేలుతుందో, టాలీవుడ్‌కు మరో భారీ మల్టీస్టారర్ ప్రయాణం స్టార్ట్ కానుంది.