మూవీడెస్క్: విజయ్ దేవరకొండ వరుసగా బిగ్ బడ్జెట్ సినిమాలతో బిజీ అవుతున్నాడు. ఇక ప్రస్తుతం, విజయ్ మరో కొత్త ప్రాజెక్ట్ ప్రారంభించనున్నాడు, ఇది దిల్ రాజు బ్యానర్‌లో తెరకెక్కనుంది.
గతంలో ‘ఫ్యామిలీ స్టార్’ సినిమాను తీసిన దిల్ రాజు, ఈసారి 1980ల యాక్షన్ నేపథ్యంతో కూడిన ఒక చిత్రాన్ని నిర్మించనున్నట్లు తెలుస్తోంది.
2025లో షూటింగ్ ప్రారంభమవుతుందట. సినిమా కథ, నటీనటుల వివరాలు ఇంకా ప్రకటించలేదు, కానీ ఇది ఒక యాక్షన్ థ్రిల్లర్‌గా ఉండనుందని తెలుస్తోంది.
ఈ కొత్త ప్రాజెక్ట్‌ను బిగ్ బడ్జెట్‌తో రూపొందించబోతున్నారు. దిల్ రాజు బ్యానర్‌లో మొదట విజయ్, మోహనకృష్ణ ఇంద్రగంటి తో సినిమా చేయాల్సి ఉంది.
కానీ, ఆ ప్రాజెక్ట్ ప్రస్తుతం రద్దు అయింది. దిల్ రాజు, ఇప్పుడు మరో దర్శకుడిని తీసుకున్నట్లు సమాచారం.
అంతేకాకుండా, విజయ్ దేవరకొండ గౌతమ్ తిన్ననూరి, రాహుల్ సాంకృత్యాన్, రవికిరణ్ కోలా వంటి దర్శకులతో కూడా సినిమాలు చేస్తున్నాడు.
సుకుమార్‌తో కూడా ఒక ప్రాజెక్టు ఉంటుందని సమాచారం. ప్రస్తుతం, విజయ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో చేస్తున్న సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది.
విజయ్ అందులో రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నాడు. ఈ సినిమా ఎమోషనల్ రివెంజ్ డ్రామాగా
రూపొందుతోందని సమాచారం.