మూవీడెస్క్: ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఇంటి, ఆఫీస్‌లపై ఆదాయపు పన్ను శాఖ నిర్వహించిన సోదాలు సినీ పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారాయి.
ఈ సోదాల అనంతరం దిల్ రాజు మీడియా ముందు మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
దిల్ రాజు మాట్లాడుతూ, “సినీ పరిశ్రమలో బ్లాక్ మనీ అనేది ఇప్పుడు లేదు. టికెట్ల బుకింగ్స్‌లో 80 శాతం ఆన్‌లైన్‌లో జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో బ్లాక్ మనీకి అవకాశం లేదు” అని స్పష్టం చేశారు.
ఫేక్ కలెక్షన్ పోస్టర్స్ వల్ల పరిశ్రమపై ఎలాంటి ప్రభావం ఉంటుందనే ప్రశ్నకు, “ఇది ఓ కీలక అంశం.
పరిశ్రమ మొత్తంగా ఈ అంశంపై ఒక మార్గదర్శకత్వం తీసుకురావాల్సి ఉంది” అని అభిప్రాయపడ్డారు.
రాజకీయ నాయకుల పెట్టుబడుల గురించి ప్రశ్నించగా, దిల్ రాజు సరదాగా “వారు పెట్టుబడులు పెడితే మాకు కూడా వడ్డీ తక్కువగా వస్తుంది.
మీరు చెప్పగలిగితే మాకు కూడా చెప్పండి” అని అన్నారు.
ఇటువంటి వ్యాఖ్యలు ఆయన తన హాస్యంతో సీరియస్ అంశాలను హుందాగా సమర్థించినట్లుగా కనిపించింది.
“గత ఐదేళ్లుగా ఎటువంటి స్థిరాస్తులు కొనలేదు, ఇతర వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టలేదు” అని స్పష్టం చేస్తూ, పారదర్శకత పెరగడం పరిశ్రమకు మంచిదని అభిప్రాయపడ్డారు.
సోదాల వల్ల నైతికంగా నిలదొక్కుకునే అవకాశం దొరికిందని దిల్ రాజు చెప్పిన వ్యాఖ్యలు పరిశ్రమలో చర్చనీయాంశంగా మారాయి.