fbpx
Tuesday, April 15, 2025
HomeMovie Newsసింగిల్ టేక్ లో చేసిన సుశాంత్ దిల్ బెచారా సాంగ్

సింగిల్ టేక్ లో చేసిన సుశాంత్ దిల్ బెచారా సాంగ్

DilBechara Title Track in Single Take

ముంబై: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ నటించిన చివరి చిత్రం ‘దిల్ బేచారా’. ఈ సినిమా జూలై 24న disney+hotstar డిజిటల్ ప్లాట్ ఫార్మ్ లో విడుదల అవుతుంది. ఈ సినిమా నుండి టైటిల్ ట్రాక్ ఫుల్ వీడియో ఇవాళ విడుదల చేసారు. సాంగ్ మొత్తం చూసాక సింగల్ టేక్ సాంగ్ ఆ అని డౌట్ వచ్చి చూస్తే ఇది నిజంగానే సింగల్ టేక్ లో చేసిన సాంగ్ అని కొరియోగ్రాఫర్ ఫరా ఖాన్ తెలిపారు. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ రికార్డులు బ్రేక్ చేస్తుంటే ఈ సింగల్ టేక్ సాంగ్ ఈ సినిమాకి మరొక ప్రత్యేకత గా నిలిచింది. 2:44 నిముషాల నిడివి గల ఈ సాంగ్ లో సుశాంత్ సింగిల్ టేక్ లో పెర్ఫార్మ్ చేసాడట. కేవలం కెమెరా యాంగిల్స్ సెట్ చేసుకొని ఒకే టేక్ లో షూట్ చేయడం విశేషం.

2014లో వచ్చిన హాలీవుడ్ మూవీ ‘ది ఫాల్ట్ ఇన్ అవర్ స్టార్స్’ ఆధారంగా ఈ చిత్రాన్ని కాస్టింగ్ డైరెక్టర్ ముకేశ్ చాబ్రా తెరకెక్కించాడు. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. అంతేకాకుండా సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది. ఈ మూవీలో సుశాంత్ జోడిగా సంజన సంఘి నటించగా, ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణ ఏ ఆర్ రెహమాన్ సంగీతం. ఏమి లేకుండానే ఎదో ఉంది అన్నట్టు డప్పు కొట్టుకునే ఆర్టిస్ట్స్ మధ్య సింగల్ టేక్ సాంగ్ చేసి కూడా దాన్ని ఒక గొప్పగా మేకర్స్ ప్రమోట్ చేసుకోవట్లేదు.ఈ వీడియో కి సింగిల్ టేక్ యాక్టర్ సుశాంత్ అని చాలా మంది అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు.

Dil Bechara – Title Track | Sushant Singh Rajput | Sanjana Sanghi | A.R. Rahman | Mukesh Chhabra

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular