టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఇప్పుడు మరో కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. సినిమా నిర్మాణంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయన, ఇప్పుడు టెక్నాలజీతో కూడిన భవిష్యత్తు సినిమా ప్రపంచాన్ని ఏర్పరిచేందుకు రెడీ అవుతున్నారు. ‘AI స్టూడియో’ పేరుతో భారీ ఎకోసిస్టమ్‌ను ఏర్పాటు చేస్తున్నారు.
క్వాంటమ్ AI గ్లోబల్ సంస్థతో కలిసి దిల్ రాజు ఈ కొత్త ప్రాజెక్ట్‌ను మొదలుపెట్టారు. ఇది పూర్తిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా పని చేస్తుంది. ప్రీ ప్రొడక్షన్, ఎడిటింగ్, డబ్బింగ్, VFX వంటి విభాగాల్లో AI టూల్స్‌ను ఉపయోగించేందుకు ఈ స్టూడియో రూపొందించబడుతోంది.
“లైట్స్.. కెమెరా.. ఇంటెలిజెన్స్” అనే ట్యాగ్‌లైన్‌తో ఈ AI స్టూడియోను మే 4న అధికారికంగా ప్రారంభించనున్నారు. ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్, ప్రీ లాంచ్ వీడియోలో ‘బాహుబలి’, ‘పుష్ప’ లాంటి టెక్నికల్ సినిమాల విజువల్స్ చూపుతూ కొత్త యుగానికి నాంది పలికారు.
దిల్ రాజు వెల్లడించిన ప్రకారం, 1913లో ప్రారంభమైన భారతీయ సినిమా ప్రయాణానికి 2025లో AI రూపంలో కొత్త దశ మొదలవుతోంది. సినిమా టెక్నాలజీలో ఇదొక రివల్యూషన్ అనేలా వ్యూహం రచిస్తున్నారు.
ఇది సినిమా మేకింగ్‌ను మరింత వేగంగా, ఖచ్చితంగా, తక్కువ ఖర్చుతో చేయాలన్న లక్ష్యంతో రూపొందిన ప్రాజెక్ట్‌గా నిలవబోతుంది.