fbpx
Saturday, October 19, 2024
HomeMovie Newsఅట్లీ మల్టీస్టారర్.. మరో క్రేజీ కాంబో రాబోతోంది

అట్లీ మల్టీస్టారర్.. మరో క్రేజీ కాంబో రాబోతోంది

DIRECTOR-ATLEE-COMING-WITH-MULTISTARRER
DIRECTOR-ATLEE-COMING-WITH-MULTISTARRER

మూవీడెస్క్: ‘జవాన్’ సినిమాతో అట్లీ తన క్రేజ్‌ను మరింత పెంచుకున్నాడు. ఇప్పుడు, తన తదుపరి సినిమా కోసం అట్లీ ఒక భారీ మల్టీస్టారర్ ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్.

పాన్ ఇండియా స్థాయిలో రూపొందనున్న ఈ చిత్రం అట్లీ క్రేజ్‌ను మరో స్థాయికి తీసుకెళ్లనుంది.

తాజాగా వినిపిస్తున్న టాక్ ఏమిటంటే, ఈ సినిమాకు యూనివర్సల్ హీరో కమల్ హాసన్‌ను రెండో హీరోగా తీసుకోవడానికి అట్లీ ప్రయత్నిస్తున్నాడు.

కమల్ హాసన్, సల్మాన్ ఖాన్ లాంటి భారీ స్టార్ హీరోలను ఒకే స్క్రీన్‌పై చూడటం ప్రేక్షకులకు విజువల్ ట్రీట్ లా ఉంటుందని చెప్పవచ్చు.

ఈ ప్రాజెక్ట్‌కి అనిరుద్ సంగీతం అందించనున్నట్లు సమాచారం.

అట్లీ ఇప్పటికే పాన్ ఇండియా మార్కెట్‌లో తనదైన ముద్ర వేసుకున్న దర్శకుడు. ఇప్పుడు ఈ భారీ మల్టీస్టారర్‌తో అతను 1500 కోట్ల బాక్సాఫీస్ ను టచ్ చేసే అవకాశం ఉంది.

ఈ క్రేజీ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన త్వరలోనే వచ్చే అవకాశం ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular