మూవీడెస్క్: మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న విశ్వంభర సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
బింబిసారతో హిట్ అందుకున్న వశిష్ట ఈ సినిమాను అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో రూపొందిస్తున్నాడు.
యూవీ క్రియేషన్స్ నిర్మాణంలో రూపొందుతున్న ఈ గ్రాండ్ విజువల్ ఎంటర్టైనర్ మొదట 2025 సంక్రాంతికి రావాల్సి ఉండగా, వర్క్ ఆలస్యం కారణంగా వాయిదా పడింది.
ఫ్యాన్స్ మాత్రం సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
తాజాగా తిరుమలలో దర్శనం అనంతరం, వశిష్ట మీడియాతో మాట్లాడుతూ విశ్వంభర రిలీజ్ డేట్‌పై స్పందించాడు.
“త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుంది, కానీ ఇప్పుడే చెప్పడం తొందరపాటు అవుతుంది” అంటూ క్లారిటీ ఇచ్చాడు.
దీంతో ఈ సినిమా 2025 చివర్లో రానుందా? అనే ఉత్కంఠ కొనసాగుతోంది.
అయితే, మెగాస్టార్ అభిమానులు మాత్రం సినిమా ఎప్పుడు వచ్చినా భారీ విజువల్స్‌తో మంత్ర ముగ్ధులయ్యేలా ఉండబోతుందని భావిస్తున్నారు.
దర్శకుడు వశిష్ట మాట్లాడుతూ, “ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.
ఇది తప్పకుండా బ్లాక్‌బస్టర్ అవుతుంది” అంటూ కాన్ఫిడెంట్‌గా చెప్పాడు.
అదే సమయంలో బింబిసార 2 గురించి అడిగినప్పుడు, ప్రస్తుతం పూర్తిగా విశ్వంభర మీదే ఫోకస్ చేస్తున్నానని స్పష్టత ఇచ్చాడు.
ఈ సినిమా మెగాస్టార్ కెరీర్‌లో కొత్త కాన్సెప్ట్‌తో రూపొందనుందని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.
భారీ గ్రాఫిక్స్, వశిష్ట స్టైల్ నేరేషన్, చిరంజీవి ఎనర్జీ అన్నీ కలిసి విశ్వంభరను మెగా విజువల్ ట్రీట్‌గా మార్చబోతున్నాయి.
మరి సినిమా ఎప్పుడు థియేటర్లలో సందడి చేస్తుందో చూడాలి.