త్రిస్సూర్: సినిమా పరిశ్రమలో విషాదాలు ఇప్పుడే ముగిసిపోయేట్టు లేవు.
అయ్యప్పణ్ణుమ్ కోశియుమ్ – కొంచెం ఇతర బాషా సినిమాలు ఫాలో అయ్యే వాళ్ళకి ఈ పేరు సుపరిచితమే. ఈ సంవత్సరమే విడుదల అయిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవడం తో పాటు ఇతర భాషల్లో కూడా ఈ సినిమా ని రీమేక్ చేసేందుకు ప్రయత్నాలు కూడా మొదలయ్యాయి. ఈ సినిమా డైరెక్టర్ సాచి, పూర్తి పేరు కే అర్ సచ్చిదానందన్. గత కొద్దీ రోజులుగా గుండె పోటుతో హాస్పిటల్ లో చికిత్స పొందుతూ గురువారం రాత్రి మరణించారు.
మళయాళ చిత్ర పరిశ్రమలో సాచీ కి కథా రచయితగా, మాటల రచయితగా మంచి పేరుంది. నిర్మాతగా కూడా ఒక సినిమా నిర్మించారు. దర్శకుడిగా ఆయన మొదటి సినిమా అనార్కలి, రెండవది అయ్యప్పణ్ణుమ్ కోశియుమ్. రచయిత గా సేతునాథ్ లో కలిసి చేసిన సినిమాలకి సాచీ కి చాలా మంచి పేరు వచ్చింది. రచయితగా వీళ్ళ కాంబో లో విదులైన ‘చాక్లెట్ ‘ సినిమా చాలా పెద్ద సక్సెస్ అవడం తో వీరి కాంబినేషన్ లో చాలా సినిమాలు వచ్చాయి. ఆ తర్వాత దర్శకుడిగా , రచయితగా కూడా మంచి విజయాల్ని అందుకున్నాడు. ఇంతలోనే గుండెపోటు తో మరణించడంతో ఇండస్ట్రీ విషాదం లో మునిగిపోయింది.