హైదరాబాద్: తెలుగులో ‘అ!’, ‘కల్కి’ లాంటి వైవిధ్యమైన సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్న దర్శకుడు ప్రశాంత్ వర్మ. ప్రస్తుతం ఈ దర్శకుడు తన మూడవ సినిమాగా ‘జాంబీ రెడ్డి’ అనే విభిన్న టైటిల్‌తో కొత్త సినిమా తీస్తున్నాడు. ఈ సినిమా టైటిల్ లోగోను ఆయన ఈ మధ్యనే రిలీజ్ చేశాడు. తెలుగులో ఇదే మొట్టమొదటి జాంబీ ఫిల్మ్. అయితే, ఈ సినిమాకు పెట్టిన టైటిల్‌పై వివాదం రాజుకుంది. ఒక సామాజిక వర్గం వారి మనోభావాలు దెబ్బ తిన్నట్టు వార్తలు వచ్చాయి. దీంతో ప్రశాంత్ వర్మ ఓ ప్రకటన విడుదల చేసి వివరణ ఇచ్చాడు.
“ఇటీవల తమ సినిమాకు ‘జాంబీ రెడ్డి’ టైటిల్ని ప్రకటించామని, దానికి మంచి స్పందన వచ్చిందని చెప్పాడు. ట్విట్టర్‌లోనూ బాగా ట్రెండ్ అయ్యిందని అన్నాడు. ఈ పేరు చాలా బాగుందంటూ చాలా కాల్స్, మెసేజులు వచ్చాయని చెప్పాడు. అయితే, కొంతమంది మాత్రం టైటిల్‌ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారని వివరించాడు. ఈ సినిమా ద్వారా ఎవరినీ తక్కువ చేసి చూపించడం, ప్రత్యేకించి ఓ కమ్యూనిటీని తక్కువ చేసి చూపించడం ఉండదని ఆయన వివరించాడు.యానిమేషన్ కి మంచి పేరొచ్చింది. మూడు నెలలకు పైగా టీమ్ పడిన కష్టానికి వచ్చిన రిజల్ట్ తో మేమంతా హ్యాపీగా ఉన్నాం అని చెప్పారు. తన ఇంతకముందు సినిమాలు తెలంగాణ బ్యాక్ డ్రాప్ తో సెటప్ అయిందో ఈ మూవీ రాయలసీమలోని కర్నూలు ప్లేస్ లో కథ జరుగుతుంది. హాలీవుడ్ లో ఈ టైపు ఎపిడెమిక్ ఫిలిమ్స్ చూస్తుంటాం. అక్కడ న్యూయార్క్ లాంటి సిటీస్ లో ఆ కథ జరిగినట్లు చూపిస్తుంటారు. నేను ఇక్కడ కర్నూలును నేపథ్యాన్ని ఎంచుకున్నాను’. కర్నూలులో ఇలాంటి ఎపిడెమిక్ జరిగితే.. అక్కడి ప్రజలు ఎలా ఫైట్ చేసి దానిని ఆపి ప్రపంచాన్నంతా ఎలా కాపాడతారన్నది ఇందులోని మెయిన్ ఐడియా. సినిమా చూస్తే కర్నూలును కథ ఎంత హైలైట్ చేస్తుందో తెలుస్తుంది. దయచేసి ఈ టైటిల్ ను ఎవరూ తప్పుగా అర్థం చేసుకోవద్దు. సినిమా చూసిన తర్వాత మీరు ప్రౌడ్ గా ఫీల్ అవుతారు. నా ఫస్ట్ సినిమాకి నేషనల్ వైడ్ గుర్తింపు ఎలా వచ్చిందో.. ఈ సినిమాకు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు వస్తుందని నమ్ముతున్నాను. అప్పుడు మీరందరూ గర్వంగా ఫీల్ అవుతారు. నన్ను నమ్మండి” అని ప్రశాంత్ వర్మ తెలిపారు.