పోలవరం ప్రాజెక్టు, ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవనాడిగా నిలవగా, ఈ ప్రాజెక్టుకు కేంద్రం నుండి అనుకున్నంత నిధులు రాకపోవడంతో రాష్ట్రంలో నిరాశ నెలకొంది. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో 12,000 కోట్లు కేటాయిస్తామనే హామీ ఇచ్చినా, తాజా నిధుల విడుదల కేవలం రూ.2,800 కోట్లకు పరిమితమైంది.
సీఎం చంద్రబాబు, తన ఢిల్లీ పర్యటనలో పోలవరం నిధులపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి ఆందోళన వ్యక్తం చేశారు. మోడీ హామీ ఇచ్చినా, ఆర్థిక సహాయం ఆశించిన మేరకు రాలేదు.
అందులో రూ.800 కోట్లు పాత బిల్లుల రీయింబర్స్‌మెంట్ కింద మరియు రూ.2000 కోట్లు అడ్వాన్స్‌గా విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు.
అయితే, ప్రాజెక్టు పూర్తి చేసేందుకు ప్రభుత్వం లెక్కించిన రూ.3,450 కోట్ల అడ్వాన్స్ ఇంకా రావాల్సి ఉండటంతో పోలవరం ఆర్థిక సమస్యల నుంచి తక్షణం విముక్తి పొందేలా కనిపించడం లేదు.