fbpx
Sunday, January 19, 2025
HomeMovie News'దిశా - ఎన్ కౌంటర్' ఫస్ట్ లుక్

‘దిశా – ఎన్ కౌంటర్’ ఫస్ట్ లుక్

Disha-Encounter FirstLookBy RamgopalVarma

హైదరాబాద్: రామ్ గోపాల్ వర్మ నుండి సినిమా అప్ డేట్స్ తగ్గిపోయాయి అనుకుంటుంటే మళ్ళీ మొదలు పెట్టాడు. 2019 లో హైదరాబాద్ లో జరిగిన దిశా రేప్ అండ్ మర్డర్ కి సంబందించిన స్టోరీ ని సినిమాగా తీస్తున్న విషయం తెలిసిందే. ఆ సినిమాకి సంబందించిన అప్ డేట్స్ ఈ రోజు వర్మ తెలియ చేసాడు. నవంబర్ 26 2019 న చాలా దారుణంగా దిశా ని గ్యాంగ్ రేప్ చేసి, చంపి, తగలబెట్టిన ఉదంతాన్ని సినిమాగా తెరకెక్కిస్తున్నామని అలాగే ఆ సినిమా టీజర్ ని సెప్టెంబర్ 26 న , సినిమాని నవంబర్ 26 న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. వీటితో పాటు ఈ సినిమా ఫస్ట్ లుక్ ని విడుదల చేసాడు.

ఆరు నెలల క్రితమే వర్మ ఈ సినిమాను తీస్తానంటూ ప్రకటించాడు. అయితే ఇన్నాళ్లు అయినా అప్ డేట్ ఇవ్వక పోవడంతో వర్మ దిశ సినిమాను పక్కకు పెట్టాడేమో అంటూ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ సినిమాలో దిశా ని ఎలా కిడ్నాప్ చేసారు, ఆ తర్వాతి పరిస్థితులు ఏంటి ఆ తర్వాత అందులో నిందితుల్ని ఎన్కౌంటర్ చేసేంత వరకు వర్మ చూపంచబోతున్నట్టు తెలిపాడు. కానీ అప్పట్లో తన సినిమా కోసం నిందితుల్లో ఒకరి భార్యను ఇంటర్వ్యూ తీసుకున్నాడు. ఈ ఇన్సిడెంట్ కి ముందు వీళ్ళ లవ్ స్టోరీ కూడా కథలో జోడించే ఉద్దేశ్యం ఉన్నట్టు అప్పట్లో తెలిపాడు. కానీ సినిమాలో దానిని ఎంతవరకు చూపిస్తాడో తెలియాల్సి ఉంది. ఈ సినిమాని నట్టి కరుణ సమర్పిస్తుండగా అనురాగ్ కంచర్ల నిర్మిస్తున్నాడు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular